ప్రమోషన్స్‌లో చీరకట్టులోనే కనిపిస్తున్న రష్మిక..అదే కారణమా? | Rashmika Mandanna Stunning Looks In Saree At Animal Movie Promotions | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: చీరకట్టులో తళుక్కుమంటున్న రష్మిక, ఆ పోస్ట్‌ వల్లేనా?

Published Tue, Nov 28 2023 10:56 AM | Last Updated on Tue, Nov 28 2023 12:04 PM

Rashmika Mandanna Stunning Looks In Saree At Animal Promotions - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకి మించిపోయే ఫాన్ ఫాలోయింగ్‌తో రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్‌ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటి దక్కించుకున్న ఈ బ్యూటీ ఛలో సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస హిట్స్‌తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్‌లోను తన సత్తా చాటుతోంది.

ప్రస్తుతం ఆమె నటించిన లేటెస్ట్‌ మూవీ యానిమల్‌. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక, రణబీర్‌ కపూర్‌ జంటగా నటించారు. ఫుల్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ జోరు పెంచారు మూవీ టీం. ఇందులో రష్మిక లేటెస్ట్‌ లుక్స్‌ నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతున్నాయి.

మొన్నా మధ్య రష్మిక తన ఇన్‌స్టాలో.. శారీలో ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ మీరంతా(అభిమానులను ఉద్దేశించి)నాకు చీరలపై ఉన్న ఇష్టాన్ని పెంచేశారు అంటూ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి రష్మిక ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంది. తాజాగా యానిమల్‌ ప్రమోషన్స్‌ అన్నింట్లో చీరల్లోనే మెస్మరైజ్‌ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో వైట్‌ శారీలో దేవకన్యలా మెరిసిపోయింది రష్మిక.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఆర్గాంజా శారీలో అదరహో అనిపించే అందంతో మెరిసిపోయింది. మొన్నటికి మొన్న ఓ షోకు హాజరైన రష్మిక బ్లాక్‌ శారీలో తళుక్కుమంది. చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించిన ఈ చీర ధర అక్షరాల 80వేల రూపాయలట. ఇక రీసెంట్‌గా ప్రముఖ డిజైనర్ అర్పితా ఖాన్ డిజైన్ చేసిన పింక్ చీరలోనూ వయ్యారాలు ఒలికించింది. 

ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ముందుండే రష్మిక చీరకట్టులోనూ మరింత అందంగా కనిపిస్తోంది. దీంతో రష్మికకు-చీరలకు ఏందో లింక్‌ ఉన్నట్లుంది, త్వరలోనే రివీల్‌ చేస్తుందేమో చూడాల్సి ఉంది నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement