రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ హాలోవీన్ 2025 వేడుకల్లో ఆకర్షణీయంగా నిలిచారు. జామ్‌నగర్‌లో నీతా ముఖేష్ అంబానీ ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేయగా, బాలీవుడ్ ప్రముఖులంతా సందడి చేశారు. నీతా ప్రముఖ నటి ఆద్రీ హెప్బర్న్‌గా కనిపించారు. ఈ వేడుకలో ఆమెతో పాటు మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఓర్హాన్ అవత్రమణి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వేడుకకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. దీంతో ఇది వైరల్‌గా మారింది.
ముంబైలో జరిగిన ఈ వేడుకల్లో ఆలియా భట్ మరియు రణవీర్ సింగ్ వంటి ఇతర బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు నీతా అంబానీ 1950ల నాటి నటి ఆద్రీ హెప్బర్న్‌ని పోలిన దుస్తుల్లో మెరిశారు. 62 వయసులో కూడా Gen-Z ఐకాన్‌గా నీతా అంబానీ మారిపోవడం పలువురిని ఆకర్షించింది. భారతదేశంలో పెద్దగా జరుపుకోని ఈ పండుగకు ఇంతటి విలాసం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అటు బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే తన లేడీ సింఘం పాత్రలో కనిపించగా మరో స్టార్ హీరోయిన్ అలియా భట్ లారా క్రాఫ్ట్ పాత్రను పోషించింది.

ఇక రణ్‌వీర్ సింగ్ వే డాన్ 3 హీరో డెడ్‌పూల్ వేషధారణలో కనిపించగా, ఓర్రీ వీడియోలో అది మార్వెల్ సూపర్ హీరో విశ్వం నుండి వచ్చిన స్పైడర్ మ్యాన్ అని పేర్కొన్నారు. ఇంకా నీతా అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ అంబానీ, భార్య శ్లోకా మెహతా కూడా ప్రత్యేక వేషధారణలో అలరించారు.బాలీవుడ్ అర్జున్ కపూర్ ది టెర్మినేటర్ వేషధారణలో ,జాన్వీ కపూర్ ఏంజెలా డి మార్కో వేషధారణలో అలరించారు.

ఇదీ చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!
చదవండి: బ్లాక్ ఫంగస్ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా?


