తొక్కలో బిజెనెస్‌తో క్లీన్‌ స్వీప్‌..! | Mumbai Mothers Turn Lemon Peels From Juice Shops Into Safe Cleaners | Sakshi
Sakshi News home page

తొక్కలో బిజెనెస్‌తో క్లీన్‌ స్వీప్‌..!

May 28 2026 5:53 AM | Updated on May 28 2026 5:53 AM

Mumbai Mothers Turn Lemon Peels From Juice Shops Into Safe Cleaners

ఆవిష్కరణలు యూనివర్శిటీ డిగ్రీల నుంచి కాకుండా... అవసరాల నుంచే ఎక్కువగావస్తాయి అని చెప్పడానికి తాజా ఉదాహరణ ముంబైకి చెందిన సోనియా వర్మ, ఫర్హీన్‌. సాధారణ గృహిణులు అయిన వీరు, వాడి పారేసిన నిమ్మకాయ తొక్కలతో ఎకో ఫ్రెండ్లీ క్లీనర్స్‌ తయారు చేస్తూ ‘ఊర్థి’ బ్రాండ్‌గా సక్సెస్‌ అయ్యారు...

ఇంటిని శుభ్రపరిచే ద్రావణాలలో ఉండే కఠినమైన రసాయనాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఎలర్జీకి కారణం అవుతాయి. వీటికి ప్రత్యామ్నాయంగా సోనియా వర్మ, ఫర్హీన్‌ అలీల ఆవిష్కరణ సూపర్‌హిట్‌ అయింది. ‘ఊర్థి’ బ్రాండ్‌గా ఫేమ్‌ అయింది.

ఇల్లే ప్రయోగశాలగా...
సోనియ, ఫర్హీన్‌లు కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలోని ఒక హోమ్‌స్కూల్‌ కమ్యూనిటీ ద్వారా స్నేహితులు అయ్యారు. ఇద్దరికీ ఒకే రకమైన ఆసక్తులు ఉన్నాయి.
వివిధ విషయాలకు సంబంధించి ‘ఇలా కాకుండా అలా ఉంటే ఎలా ఉంటుంది!’ అని మాట్లాడుకునేవారు. ఇంటిని శుభ్రపరిచేటప్పుడు గృహిణులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఒకసారి మాట్లాడుకున్నారు.
‘కఠినమైన రసాయనాలు లేని క్లీనర్స్‌ తయారు చేస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచనల్లో నుంచి పుట్టిందే... ఊర్థి. వారి ఆలోచనలకు ఇల్లే ప్రయోగశాలగా మారింది.

స్వచ్ఛమైన ప్రత్యామ్నాయం
ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌ చేసిన ఫర్హీన్‌ కుటుంబ బాధ్యతల వల్ల ఇంటికే పరిమితం అయింది. అయినప్పటికీ బయోఎంజైమ్‌లతో రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉండేది. తన కుటుంబ సభ్యులు నిర్వహించే కేబుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యాపారం నుంచి తప్పుకొని ఇంటి బాధ్యతలకే పరిమితం అయింది సోనియా వర్మ. ఫర్హీన్‌ తో పరిచయం ఆమెను ప్రయోగాల దిశలోకి తీసుకెళ్లి ‘ఊర్థి’ రూపంలో స్వచ్ఛమైన ప్రత్యామ్నాయాన్ని అందించేలా చేసింది. ‘మేము ప్రయోగాలు చేయడానికి డ్రమ్ములు, విశాలమైన స్థలం అవసరం. ఎలా? అని ఆలోచిస్తున్నప్పుడు తన ఇంటి టెర్రస్‌ను వాడుకోవచ్చు అని ఫర్హీన్‌ చెప్పింది. అలా టెర్రస్‌పై మా ప్రయోగాలు మొదలయ్యాయి’ అంటుంది సోనియ.

రెండు డ్రమ్ములతో మొదలై...
రెండు డ్రమ్ములతో మొదలైన ప్రయోగాలు సఫలం అయ్యాయి. ఆ తరువాత వేరే చోట స్థలం తీసుకొని డజన్‌ల కొద్దీ్ద డ్రమ్ములతో ఫెర్మెంటేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. స్థానికంగా జ్యూస్‌ అమ్మే వారి నుండి నిమ్మపండ్ల తొక్కలు సేకరిస్తారు. నిమ్మజాతి పండ్ల తొక్కలు, బెల్లం, నీటి మిశ్రమాన్ని సుమారు మూడు నెలలపాటు గాలి చొరబడని డబ్బాలలో ఉంచుతారు. అది పులిసిపోయి సహజమైన క్లీనర్‌గా మారేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

‘పులియబెట్టిన తరువాత బయటకు వచ్చే ద్రవంలో మంచి బ్యాక్టీరియా, ఎంజైములు ఉంటాయి. ఆ ఎంజైములు ఉత్ప్రేరకాలుగా పనిచేసి మురికిని తొలగిస్తాయి’ అంటుంది ఫర్హీన్‌.

‘ఊర్థి’ అనేది ఇప్పుడు నలభైకి పైగా ఫెర్మెంటేషన్‌ యూనిట్లుగా విస్తరించింది. ఈ యూనిట్‌లలో రకరకాల నేచురల్‌ క్లీనింగ్‌ ప్రాడక్ట్స్‌ను తయారు చేస్తున్నారు.
‘మేము తొలి అడుగులు వేసినప్పుడు మా దగ్గర ఎలాంటి ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌గానీ, బిజినెస్‌ ΄్లాన్‌గానీ లేదు. ఏది సరిౖయెనది అనిపించిందో అదే చేయడం ప్రారంభించాం. ఆ తర్వాత వాటంతట అవే చక్కబడ్డాయి’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది సోనియా.
 
ఎకోఫ్రెండ్లీ బయో ఎంజైమ్‌లు
చాలా రసాయన క్లీనర్‌లు వాడిన తరువాత మురికి కాలువల్లోకి, నదుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. దీనికి భిన్నంగా ‘ఊర్థి’ క్లీనర్స్‌ కాలువల్లోకి వెళ్లినప్పుడు అక్కడ కూడా సేంద్రియ వ్యర్థాలను (ఆర్గానిక్‌ వేస్ట్‌) విచ్ఛిన్నం చేస్తూనే ఉంటాయి. నీటి వ్యవస్థను కూడా శుభ్రం చేస్తాయి. అనేక రకాల మేలు చేసే సూక్ష్మజీవులను చంపే కఠినమైన
క్రిమిసంహారకాల వలే కాకుండా ఊర్థిలోని బయో ఎంజైమ్‌లు పర్యావరణంలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు జీవించడానికి వీలు కల్పిస్తాయి.
– సోనియ, ఫర్హీన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement