కట కటా... మర్కటా!

Monkey Snatches Mans Glasses, Gets Tricked By Woman  - Sakshi

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ కోతి వీడియో వైరల్‌ అయింది. మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అనగా....ఒకాయన ఏదో ఆలోచిస్తూ ఆలయం మెట్లు ఎక్కుతూ వస్తుంటాడు. ఆ మెట్ల పక్కన గద్దెపై కూర్చున్న కోతి ఆ వ్యక్తి కళ్లద్దాలను లాగేసుకుంది.

ఇతడు బిత్తరపోతూ ఉండగానే ‘ఈ అద్దాలు నాకు సెట్‌ అవుతాయా’ అన్నట్లుగా ట్రయల్స్‌ స్టార్ట్‌ చేసింది కోతి. ఈలోపు అక్కడికి వచ్చిన ఒక మహిళ కొన్ని పండ్లను కోతి ముందు పెట్టింది. అంతే...ఆ అద్దాలను పక్కన పెట్టి పండ్ల పని పట్టింది కోతి. ఈ వీడియోను చూస్తూ బిగ్గరగా నవ్వుతున్న వాళ్లతో పాటు ‘అయ్యో..ఈ వనజీవులు ఎంత ఆకలితో అల్లడుతున్నాయో కదా!’ అని బాధపడుతున్న వారూ ఎందరో ఉన్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top