ఓ వ్యక్తి స్నేహితుడి కూతురు కోసం అందమైన గిఫ్ట్‌ని స్వయంగా తన చేతులతో సిద్ధం చేశాడు. తీరిగ్గా చేసింది కాదు. బిజీ షెడ్యూల్‌లో రెండు విమానాల జర్నీలో అలవొకగా తయారు చేశాడు. నిజంగా అది అతడి నైపుణ్యం, విలువైన గిఫ్ట్ ఇవ్వాలన్నా అతడి ఆలోచనకు నిదర్శనం. ఆ గిఫ్ట్ నెటిజన్ల మనసుని అమితంగా దోచుకోవడమే కాదు..అతని క్రియేటివిటీకి ఫిదా అయ్యారు కూడా.
వెల్లూరు మెడికల్ కాలేజీలో సైక్రియాట్రిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ధీరజ్ తన బిజీ విమానాల షెడ్యూల్‌లో తన స్నేహితుడి కూతురు కోసం గిఫ్ట్ తయారు చేశాడు. లేత గులాబీ వూల్‌తో అల్లిన ఆ టోపీ ఎంత అందంగా ఉందంటే..అతడు అల్లికల్లో కూడా డాక్టర్ అని అనొచ్చేమో అన్నంత అందంగా కుట్టేశాడు. చేతితో తయారు చేసిన ఈ గిఫ్ట్ అతడి క్రియేటివిటీకి, శ్రమకు నిదర్శనం.
జస్ట్ మూడు రోజుల్లో రెండు విమానాల ప్రయాణాల వ్యవధిలో ఈ టోపిని అల్లేయడం విశేషం.అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేస్తూ..మూడే మూడు రోజుల్లో రెండు విమాన జర్నీలలో స్నేహితుడి కుమార్తె కోసం తయారు చేసిన టోపీ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు.
నెటిజన్లు దొరికిన ఖాళీ సమయాన్ని వృధాగా పోనివ్వకుండా క్రియేటివిటీగా చేతితో తయారు చేసిన గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. ఇది వెలకట్టలేని అమూల్యమైన గిఫ్ట్. అన్ని డబ్బులతో కొనలేం అనేందుకు ఈ గిఫ్టే ఉదాహరణ అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.
Two flight trips in three days. Finished a beanie for friend's daughter. pic.twitter.com/SVM7tmRUjt
— Dr Dheeraj K, MD, DM, 🇮🇳🇬🇧🇦🇺 (@askdheeraj) December 16, 2025
(చదవండి: Sobhita Dhulipala: గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిన శోభితా ధూళిపాళ..!)


