Sakshi News home page

ఆసక్తి... అధ్యయనం... నైపుణ్యం

Published Wed, Dec 27 2023 11:30 AM

Leading tech companies are offering free courses related to AI - Sakshi

‘నేటి ఆసక్తి  రేపటి నైపుణ్యం’ అంటారు. కాలేజి చదువుతో సంబంధం లేకుండానే ఆర్టిఫిషియల్‌ ఇంటెలి జెన్స్‌(ఏఐ)కి సంబంధించిన ప్రాథమిక విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తోంది యువతరం. గూగుల్, మైక్రోస్టాప్ట్, అమెజాన్‌... మొదలైన దిగ్గజ సంస్థలు అందించే షార్ట్‌ టైమ్‌ ఉచిత కోర్సులలోప్రావీణ్యం సంపాదించి తొలి అడుగు వేస్తున్నారు...

సంప్రదాయ హద్దులను చెరిపేస్తూ, ఆలోచనలను పునర్నిర్వచిస్తూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రెవెల్యూషనరీ ఫోర్స్‌గా ఎదుగుతోంది. విద్యారంగానికి సంబంధించి ‘ఏఐ’ అనేది గేమ్‌–చేంజర్‌ అయింది. ఎడ్యుకేషనల్‌ యాక్టివిటీస్‌లో ఆటలను పోలిన ఎలిమెంట్స్‌ను ΄÷ందుపరిచి, నేర్చుకునే విధానాన్ని ఆసక్తికరం చేసే ‘గేమిఫికేషన్‌’ ప్రక్రియ ఊపందుకుంటుంది.

తాము ఏ కోర్సు చదువుతున్నాం అనేదానితో సంబంధం లేకుండా ‘ఏఐ’కి సంబంధించినప్రాథమిక విషయాలపై ఆసక్తి చూపుతున్న వారికి దిగ్గజ సంస్థల ఏఐ ఉచిత కోర్సులు వరంగా మారాయి.

2025 నాటికి 20 లక్షల మందికి ఏఐ స్కిల్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది అమెజాన్‌. దీనికి ‘ఏఐ రెడీ’ అని పేరు పెట్టారు. నెక్ట్స్‌–జెన్‌ ఏఐ టెక్నాలజీని పరిచయం చేసే కార్యక్రమం ఇది.  

ఫౌండేషనల్‌ ఏఐ కాన్సెప్ట్స్,ప్రాక్టికల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) ఎనిమిది ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తుంది. ఐకి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సాంకేతిక దిగ్గజం గూగుల్‌ పదిహేను భాషల్లో అందుబాటులో ఉండే ఉచిత ‘ఏఐ సర్టిఫికేషన్‌’ కోర్సులకు రూపకల్పన చేసింది.

ఏఐకి సంబంధించినప్రాథమిక విషయాలను అవగాహన పరిచే లక్ష్యంతో దీన్నిరూపొందించారు. బిగినర్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది. లెసన్స్‌ను ఆరు మాడ్యూల్స్‌గా విభజించారు. వాటిజ్‌ ఏఐ; ఏఐప్రాబ్లం సాల్వింగ్, రియల్‌ వరల్డ్‌ ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, న్యూట్రల్‌ నెట్‌వర్క్స్, ఇంప్లికేషన్స్‌లాంటి ఆరు చాప్టర్‌లు ఉంటాయి.  

రకరకాల ఎక్సర్‌సైజ్‌లు ఉండే ఈ ఉచిత కోర్సులలో స్టూడెంట్స్‌ 50 శాతం ఎక్సర్‌సైజ్‌లను కరెక్ట్‌గా చేయాల్సి ఉంటుంది. ‘రెస్సాన్సిబుల్‌ ఏఐ’ అనే కోర్స్‌ను కూడారూపొందించింది గూగుల్‌. ఏఐ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ ఆండ్రూ ఎన్‌జీ దీన్నిరూపొందించారు. జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యం రోజువారీ పనుల్లో ఎలా సహాయ పడుతుంది, ఏఐ ఆధునాతన ఉపయోగాలు ఏమిటి... మొదలైనవి ఇందులో ఉంటాయి.

‘ఏఐ’కి  సంబంధించిప్రాథమిక విషయాలను అవగాహన పరిచే కోర్సునురూపొందించింది మైక్రోసాఫ్ట్‌. 24 లెసన్స్‌కు సంబంధించి పన్నెండు వారాల కరికులమ్‌ ఇది. జెనరేటివ్‌ ఇంటెలిజెన్స్‌ పరిచయం, అది పని చేసే విధానం, కంటెంట్‌ను క్రియేట్‌ చేసే పద్ధతులు, వివిధ రకాల మోడల్స్‌...మొదలైనవి దీనిలో ఉన్నాయి. ఈ కోర్సును ప్రముఖ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎక్స్‌పర్ట్‌  పినార్‌ సెనార్‌రూపొందించారు... యువతరం ఆసక్తి చూపుతున్న ఎన్నో కోర్సులలో ఇవి కొన్ని మాత్రమే.

‘నేటి ఆసక్తి... రేపటి నైపుణ్యం’ అనే మాట అక్షరాలా నిజమనిప్రాంజలి సక్సెస్‌ స్టోరీ చెప్పకనే చెబుతుంది.పదహారు సంవత్సరాల వయసులో ఏఐ స్టార్టప్‌ ‘డెల్వ్‌.ఏఐ’ ఫౌండర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిందిప్రాంజలి అసస్తీ. ఏడు సంవత్సరాల వయసులో కోడింగ్‌పై ఆసక్తి మొదలైంది. తండ్రి సహాయంతో రకరకాల సాంకేతిక విషయాలపై అవగాహన పెంచుకుంది.

మన దేశంలో పుట్టినప్రాంజలి పదిసంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వెళ్లింది. హైస్కూల్‌ రోజుల్లో చాలెంజింగ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ప్రాజెక్ట్‌లపై పనిచేసేది. చిన్నప్పటి నుంచి సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ల గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. వారి స్ఫూర్తితో సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోందిప్రాంజలి అసస్తీ.

ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌ నుంచి  బయటపడాలి
సెల్ఫ్‌–ఇంప్రూమెంట్‌ అనేది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరోవైపు నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానించాలి. వాటిద్వారా తప్పులు సరిదిద్దుకోవాలి. బిజినెస్‌ప్రారంభించిన కొత్తలో ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలి. ఆ ఉత్సాహం మనకు ఎంతో శక్తిని ఇస్తుంది. కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటికి రావడానికి ఎప్పుడూ భయపడవద్దు.

రకరకాల రంగాలలో విజేతలైన ఎంతోమందిని కలుసుకొని మాట్లాడాను. వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కొని నిలదొక్కుకున్నారు. ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌(సెల్ఫ్‌–డౌట్‌)తో సతమతమయ్యేవారికి నేను చెప్పేది ఏమిటంటే మనపై మనకు నమ్మకం ఉండాలి. లేకపోతే మనలోని నైపుణ్యం, ప్రతిభ వృథా అవుతాయి. –ప్రాంజలి అవస్తీ, డెల్వ్‌.ఏఐ, ఫౌండర్‌

ఏఐ ఇన్నోవేటర్‌
ఏఐ పరిశోధనలలో చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది కేరళకు చెందిన శ్రేయా ఫ్రాన్సిస్‌. తాజాగా ఇంటర్నేషనల్‌ ఏఐ సమ్మిట్‌కు సంబంధించిన ‘ఏఐకానిక్స్‌ సొల్యూషన్స్‌ ఇంప్లిమెంటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డ్‌ గెలుచుకుంది.

ఏఐ అండ్‌ రోబోటిక్స్‌కు సంబంధించి ఎన్నోప్రాజెక్ట్‌లకు నాయకత్వం వహించింది. ఏఐ టాపిక్‌కు సంబంధించి ఎన్నో అంతర్జాతీయ సమావేశాల్లో కీలక ఉపన్యాసం ఇచ్చింది. ప్రతిష్ఠాత్మకమైన మైక్రోసాఫ్ట్‌ రిసెర్చి డైవర్సిటీ అవార్డ్‌ను రెండుసార్లు గెలుచుకుంది. -శ్రేయా ఫ్రాన్సిస్‌

Advertisement

What’s your opinion

Advertisement