అమ్మకు 90 ఏళ్లు : అంబానీ కుటుంబంసెలబ్రేషన్స్‌ | Kokila ben Ambani 90th Birthday Grand Celebrations In Nathdwara Shrinathji Temple, Deets Inside - Sakshi
Sakshi News home page

Kokilaben Ambani Birthday Celebrations: అమ్మకు 90 ఏళ్లు, అంబానీ కుటుంబం సెలబ్రేషన్స్‌

Published Sat, Feb 24 2024 4:43 PM

Kokila ben Ambani 90th Bday Celebrations check details - Sakshi

వ్యాపారం ప్రపంచంలో  అపరకుబేరుల్లా వెలుగుతున్న ఫ్యామిలీ అంబానీ. అలాంటి వంశ పార్యంపర్య వ్యాపారానికి వెన్నుముకగా నిలిచిన అద్భత మహిళ కోకిలాబెన్ అంబానీ అంటే అతిశయోక్తి కాదు. ధీరూభాయ్ వ్యాపార ప్రపంచాన్ని శాసించినా, ముఖేష్‌ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించినా,  దీని వెనుకున్న గొప్ప మహిళా మూర్తి కోకిలా బెన్‌.

భార్యగా, తల్లిగా అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని  అంబానీ కుటుంబానికి పెద్ద దిక్కుగా బలమైన అండగా నిలిచారు. దివంగత భర్త ధీరూభాయ్ అంబానీ కలలకు అండగా నిలవడమే కాకుండా,  ఆయన మరణానంతరం  కుమారులు ముఖేష్ అంబానీ , అనిల్ అంబానీను నిలబెట్టిన మాతృమూర్తి.  

ఈ రోజుతో ఆమెకు (ఫిబ్రవరి 24) 90 ఏళ్లు . అంబానీ ఫ్యాన్‌ ప్యాజ్‌ ఇన్‌స్టా ప్రకారం ఆమె బర్త్‌డేని పురస్కరించుకొని  కోకిలాబెన కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, నీనా కొఠారి, దీప్తి సల్గావ్‌కర్, వారి జీవిత భాగస్వాములు ఆమె పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. కోకిలాబెన్ అంబానీ తన పుట్టినరోజు సందర్భంగా టీనా అంబానీ, అనిల్ అంబానీలతో కలిసి ప్రత్యేకంగా రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లోని శ్రీనాథ్‌జీ ఆలయాన్ని శనివారం సందర్శించారు. 'మనోరత్ భోగ్', ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. శ్రీనాథ్‌జీ మందిర్ మండల్ బోర్డ్ వైస్ చైర్‌పర్సన్  కూడా అయిన కోకిలా బెన్   నాధ్‌ద్వారాలోని పుష్టి మార్గీయ ప్రధాన్ పీఠ్ శ్రీనాథ్‌జీ భవనంలో 56 నైవేద్యాలు సమర్పిస్తారు.

ముఖేష్‌ అంబానీ నివాసం ఆంటిలియాలో కూడా కోకిలాబెన్ పూజలు చేశారు. అలాగే ఆంటిలియాలోని మందిరం దగ్గర పలువురు పండితులు  కోకిలాబెన్ ఆరోగ్యం కోసం ప్రార్థన్లు చేశారు. 

గతంలో 2022లో ముత్యాల అంచుతో త్రీ స్టెప్స్‌ కేక్ అద్భుతమైన కేక్‌ను తయారుచేయించారు. ఇందులో విశేషం ఏమిటంటే, అంబానీ వంశానికి చెందిన ప్రతి సభ్యుని ఫోటోలు ఇందులో ఉన్నాయి. గుజరాత్‌లో జామ్‌ నగర్‌లో పుట్టిన  ఆమె  ఇష్టదైవం కృష్ణుడు. ఇష్టమైన కలర్‌  పింక్‌.  ఆరోగ్యంగా ఉండేందుకు  రోజూయోగ సాధన, చక్కటి ఆహారం తీసుకుంటారట.

Advertisement
Advertisement