Kangana Ranaut: వారసత్వంగా మాకు అందిన చిట్కాలు.. నా బ్యూటీ సీక్రెట్ ఇదే

Kangana Ranaut- Beauty Tips: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన సౌందర్య రహస్యాన్ని వెల్లడించింది. కాంతులీనే ముఖారవిందానికి తన బామ్మలు చెప్పిన చిట్కాలే కారణం అంటోంది. పాల మీగడ, రోజ్ వాటర్‌తో మిలమిల మెరిసే ముఖం సొంతం చేసుకోవచ్చని... ఒత్తైన కేశాల కోసం ఆప్రిట్ కాల్ వాడితే ప్రయోజనకరం అని చెబుతోంది.
35 ఏళ్ల ఈ హిమాచల్ బ్యూటీ చెప్పిన చిట్కాలు ఆమె మాటల్లోనే.. ‘‘రోజూ మొహాన్ని పాల మీగడతో మృదువుగా మసాజ్ చేస్తాను. రోజ్ వాటర్‌తో క్లీన్ చేస్తాను. వారానికి మూడుసార్లు తలను ఆప్రికాట్ ఆయిల్‌తో చక్కగా మర్దన చేసి.. ఆవిరి పడ్తాను.
బాదం పప్పు తింటాను. ఇవే నా సౌందర్య రహస్యాలు. మా నానమ్మ, అమ్మమ్మ నుంచి వారసత్వంగా మాకు అందిన చిట్కాలు’’.. ఈ మేరకు కంగనా రనౌత్ తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది.
కాగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బీ-టౌన్‌లో అడుగుపెట్టిన కంగనా.. ఒకప్పుడు గ్లామర్ డాల్ పాత్రలకే పరిమితమైంది. అయితే, తన ప్రతిభను నిరూపించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి.. జాతీయ అవార్డు అందుకుంది. ఈ క్రమంలో ఎన్నో కష్టనష్టాలకోర్చిందామె. అయినా వెనకడుగు వేయక తనను విమర్శించిన నోళ్లనే ప్రశంసలు కురిపించేలా చేసింది. అందం, అభినయం కలగలసిన నటిగా పేరొంది బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది.
చదవండి: 48 ఏళ్ల వయసులోనూ ఆకట్టుకునే రూపం.. ఈ మూడు పాటించడం వల్లే అంటున్న కాజోల్
53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్ అదే!
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు