పిల్లోడు కాదు...టెక్నాలజీ పిడుగు! | Indian Origin 14-year-old Ashrit Talluri scores perfect 1600 on SAT | Sakshi
Sakshi News home page

పిల్లోడు కాదు...టెక్నాలజీ పిడుగు!

Oct 9 2026 10:51 AM | Updated on Oct 9 2026 10:54 AM

Indian Origin 14-year-old Ashrit Talluri scores perfect 1600 on SAT

అమెరికాలో హైస్కూలు స్థాయిలో విద్యార్థుల ప్రతిభను అంచనా వేయటం, కాలేజి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘స్కూల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌’ (సాట్‌)లో తెనాలికి చెందిన ప్రవాస భారతీయ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆశ్రిత్‌ తాళ్లూరి మొత్తం 1600 మార్కులకు 1600 సాధించటమేకాదు, 9వ తరగతి చదువుతున్న ఆశ్రిత్, ఖాళీ సమయంలో చార్టర్డ్‌ విమానం నడపటంలో శిక్షణతోటు పలు క్రీడల్లోనూ ప్రతిభను కనబరుస్తూ ‘టెక్నాలజీ పిడుగు’ అనిపించు కుంటున్నాడు.

తెనాలిలోని గంగానమ్మపేటకు చెందిన ఆయుర్వేద ‘వైద్యవిద్యాన్‌ ’ తాళ్లూరి సుబ్బారావు, పార్వతమ్మల మనవడు ఆశ్రిత్‌. తల్లిదండ్రులు రామ నరేష్, తరిణి. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. 2008లో అమెరికా వెళ్లి జార్జియాలోaని అట్లాంటాలో స్థిరపడ్డారు. వారి ఇద్దరు కుమారుల్లో రెండోవాడు ఆశ్రిత్‌. కంప్యూటర్‌ సైన్స్‌ ఏఐ, వైద్యం, వ్యవస్థాపనపై బలమైన ఆసక్తి కలిగిన ఆశ్రిత్‌ సైన్స్‌ ఒలంపియాడ్, చెస్, ఏఐ ఇన్‌  మెడిసిన్, ఇన్వెస్ట్‌మెంట్‌ ఒలంపియాడ్‌లో చురుకుగా పాల్గొంటున్నాడు. 

ఈ క్రమంలో మిడిల్‌ స్కూల్‌లో ఉన్నపుడే పద్నాలుగున్నర క్రెడిట్స్‌ను పూర్తి చేయగలిగాడు. దీనివల్ల హార్వర్డ్, రైస్‌ యూనివర్శిటీల్లో కాలేజి స్థాయి వేసవి ప్రోగ్రామ్స్‌ను చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ‘హెల్త్‌ సెన్స్‌’, ‘సెరిబ్రో ఏజెస్‌’ అనే కంపెనీలకు ఆశ్రిత్‌ సీఈవోగా, హారిజన్‌  స్టెమ్‌కు చాప్టర్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. తెలుగు, ఇంగ్లిష్‌తోపాటు స్పానిష్‌ భాషల్లో పట్టు కలిగిన ఆశ్రిత్‌ చెస్, తైక్వాండో సాధన చేస్తున్నాడు. 
– బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి

ఇదీ చదవండి: Success Story: ఒత్తిడి తెచ్చిన ముప్పుకి స్టార్టప్‌కి అమ్మేశాడు! కట్‌చేస్తే ఏకంగా రూ. 8వేల కోట్లు..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement