మంచి ఉద్యోగం నుంచి సివిల్స్‌, లవ్‌ అన్ని ఫెయిల్‌ చివరికి..! | IIT grad rejected Rs 10 LPA job failed UPSC 6 times Later Scucceeded Trading | Sakshi
Sakshi News home page

మంచి ఉద్యోగం నుంచి సివిల్స్‌, లవ్‌ అన్ని ఫెయిల్‌ చివరికి..!

May 28 2026 11:18 AM | Updated on May 28 2026 1:30 PM

IIT grad rejected Rs 10 LPA job failed UPSC 6 times Later Scucceeded Trading

ప్రతి వ్యక్తి కెరీర్‌లైఫ్‌లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజం. ఏదీ అంత ఈజీగా దొరికేయదు కూడా. అలానే ఈ ఐఐటీ గ్రాడ్యుయేట్‌ కూడా చదువు అవ్వంగానే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనే మంచి జాబ్‌ కొట్టేశాడు. కానీ అది వద్దనుకుని ప్రజలకు సేవ చేస్తా అంటూ సివిల్స్‌ వైపుకి వచ్చాడు. అందులో వరుసపెట్టి వైఫల్యాలే, మధ్యలో వ్యక్తిగత జీవితంలో లవ్‌ బ్రేకప్‌ ఇలా.. వరుసపెట్టి ఎదురుదెబ్బలు ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూనే ఉన్నాయి అతడిని. కానీ చివరికి వాటన్నింటిని ఓర్చుకుంటూనే సక్సెస్‌ అందుకున్నాడు. చేతులెత్తేయకుండా చివరి వరకు పోరాడటం అంటే ఇదే కదా అనిపిస్తుంది ఈ వ్యక్తి స్ఫూర్తిదాయక కథ వింటుంటే. 

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వికాస్ అల్విస్ ఐఐటి మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన తన ఫాట్‌మేట్‌ గురించి పెట్టిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌లో వికాస్‌..తన ఫ్లాట్‌మేట్ 2012లో ఐఐటి మద్రాస్ నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో బీ.టెక్ పూర్తి చేసి, రూ. 10 లక్షల వార్షిక ప్యాకేజీతో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఆఫర్‌ను అందుకున్నాడు. తొందరగానే సెటిల్‌ అయిపోయాడు. కానీ అతడు దాన్ని వద్దనుకుని మరీ యూపీఎస్సీకి సన్నద్ధమయ్యాడు. 

తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ క్లియర్‌ చేయలేకపోయాడు. రెండో సారి మెయిన్స్‌లో తప్పింది. ఇక ఈ రెండు వైఫల్యాలు కారణంగా కాస్త విరామం తీసుకుని తనకిష్టమైన బ్యాడ్మింటన్‌పై దృష్టిసారించాడు. జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఆడటం ప్రారంభించాడు. అయితే మైదానంలో చాలా రాజకీయాలు ఉండేవి వాటిని చూసి విసుగొచ్చి బ్యాడ్మింటన్‌ వదిలేసి మరో ఏడాది వృధా చేసుకున్నాడు. మళ్లీ యూపీఎస్సీకి ప్రిపేరవ్వడం ప్రారంభించాడు. ఆ టైంలోనే ప్రేమలో పడ్డాడు. దాంతో మూడోసారి ప్రయత్నంపై ఎఫెక్ట్‌ పడి సక్సెస్‌ అందుకోలేకపోయాడు. 

ఇక నాల్గో ప్రయత్నంలో లవ్‌ బ్రేకప్‌ అతడిని మరింత కుంగదీసింది. ఇక ఐదు, ఆరో ప్రయత్నాల్లో అంత సీరియస్‌నెస్‌తో ప్రిపేర్‌ కాలేక ఓటమిని చవిచూశాడు. అలా మొత్తం 12 ఏళ్లు చేజేతులారా వృధా చేసుకున్నాడు. అప్పటికీ అతనికి 35 ఏళ్లు, ఇంకా పెళ్లి కాలేదు, ఉద్యోగం కూడా లేదు. ఐఐటీ గ్రాడ్యుయేట్‌ అయిన అతడు జీవితంలో పదే పదే ఎడతెగని వైఫల్యాలను చవిచూసినప్పటికీ..చివరికి అనూహ్యంగా యూటర్న్‌ తీసుకుంది. 

అతడు ఆన్‌లైన్‌ సాయంతో ట్రేడింగ్‌ నేర్చుకుని..ఏకంగా సెబీ సలహాదారుడుగా మారాడు. పైగా ట్రేడింగ్‌ ద్వారా నెలకు ఏకంగా రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇటీవలే అతను పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు టెకీ వికాస్‌. నిజం చెప్పాలంటే అతడు ఈ స్థాయికి చేరకుంటాడని ఊహించలేదు కానీ చాలా సంతోషంగా ఉందంటూ తన పోస్ట్‌ని ముగించాడు టెకీ. ఈ కథ ఓటములు పలకరిస్తూనే ఉన్నా..గివ్‌ అప్‌ ఇవ్వకూడదని చెబుతోంది కదూ..!.

 

(చదవండి: ఇంత పక్కా రిటైర్మెంట్‌ ప్లానా!? 30 ఏళ్లకే రూ. 19 కోట్లు..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement