ఉడిపి హయగ్రీవ మద్ది, ధార్వాడ్‌ పేడా స్వీట్స్‌ ఎలా తయారుచేయాలంటే..

How To Make Hayagreeva Maddi And Dharwad Peda Sweets - Sakshi

దసరా నవరాత్రులు సందర్భంగా మీ అతిధులను ఈ వెరైటీ స్వీట్లతో ఆహ్వానించండి..

ఉడిపి హయగ్రీవ మద్ది

కావల్సిన పదార్థాలు: 
►పచ్చిశనగపప్పు – రెండు కప్పులు
►నీళ్లు – ఆరు కప్పులు
►బెల్లం – రెండు కప్పులు
►లవంగాలు – ఎనిమిది 
►నెయ్యి – నాలుగు టేబుల్‌ స్పూన్లు
►జీడి పలుకులు – ఇరవైధార్వాడ్‌ పేడా, ఉడిపి హయగ్రీవ మద్ది
►కిస్‌మిస్‌ – నాలుగు టేబుల్‌ స్పూన్లు
►యాలకుల పొడి – అరటేబుల్‌ స్పూన
►పచ్చికొబ్బరి తురుము – కప్పు

తయారీ విధానం.. 
►ముందుగా శనగపప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో వేసి ఆరు కప్పుల నీళ్లుపోసి ఐదు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికిన తరువాత నీటిని వేరు చేసి శనగపప్పుని పక్కనబెట్టుకోవాలి. 
►ఇప్పుడు స్టవ్‌ మీద మందపాటి బాణలి పెట్టి శనగపప్పు, బెల్లం, లవంగాలు వేసి కలపాలి.  సన్నని మంటమీద బెల్లం కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి.
►స్టవ్‌ మీద మరో పాన్‌ పెట్టి నెయ్యి వేసి వేడెక్కిన తరువాత జీడిపప్పు కిస్‌మిస్‌లను దోరగా వేయించాలి. 
►శనగపప్పు మిశ్రమం దగ్గర పడిన తరువాత యాలకుల పొడి, కొబ్బరి తురుము, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి కలిపి ఐదునిమిషాలు మగ్గనిస్తే హయగ్రీవ మద్ది రెడీ.

ధార్వాడ్‌ పేడా

కావల్సిన పదార్థాలు: 
►పాలు – 4 లీటర్లు
►నిమ్మరసం – నాలుగు టేబుల్‌ స్పూన్లు
►నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు
►పంచదార – 12 టేబుల్‌ స్పూన్లు
►యాలకులపొడి – అరటేబుల్‌ స్పూను. 

తయారీ విధానం.. 
►ముందుగా పాలను మీడియం మంట మీద కాయాలి. తరువాత నిమ్మరసం వేసి తిప్పితే పాలు విరిగినట్టుగా మారి నీళ్లు వేరుపడతాయి. 
►నీటిని వంపేసి పన్నీర్‌ మిశ్రమాన్ని గుడ్డలో వేసి సాధారణ నీళ్లుపోసి వడగట్టాలి. 
►పన్నీర్‌ మిశ్రమాన్ని సన్నని మంట మీద తేమ పోయేంత వరకు వేయించి, తరువాత నెయ్యి, టేబుల్‌ స్పూను పాలు, పంచదార వేసి తిప్పుతూ ఉండాలి. అడుగంటినట్టుగా ►అనిపిస్తే మధ్యలో టేబుల్‌ స్పూను పాలను వేసి కలుపుతూ ఉండాలి. 
►పంచదార కరిగేంతవరకు సన్నని మంట మీద వేయించి, పన్నీర్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారాక దించేసి చల్లారాక, పొడిచేసుకోవాలి.  
►ఇప్పుడు బాణలిలో ఈ పొడిని వేసి మూడు టేబుల్‌ స్పూన్ల పాలు పోసి ముదురు బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించి, యాలకులపొడి దించేయాలి. చల్లారాక, మిశ్రమాన్ని సిలిండర్‌ ఆకారంలో చుట్టుకుని పంచదార అద్దితే ధార్వాడ్‌ పేడా రెడీ.

చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్‌ ‘ఎ’ ఆహారం..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top