పిల్లోలు.. పరుపు ఎలా ఉండాలంటే... | How To Find The Perfect Pillow On Your Bed | Sakshi
Sakshi News home page

పిల్లోలు.. పరుపు ఎలా ఉండాలంటే...

Dec 10 2024 10:36 AM | Updated on Dec 10 2024 10:36 AM

How To Find The Perfect Pillow On Your Bed

రాత్రివేళ నిద్రలో మనం చాలాసార్లు అటు పక్కకూ, ఇటు పక్కకూ తిరగాల్సి వస్తుంది. అలా పక్కకు తిరిగి పడుకున్న  సమయంలో తలకూ, పడకకూ మధ్య చాలా గ్యాప్‌ ఉంటుంది. ఆ గ్యాప్‌ కారణంగా తలపై మరింత భారం పడి సుఖ నిద్ర సాధ్యం కాదు. అందుకే మంచి తలగడను ఉపయోగించడం ద్వారా ఆ గ్యాప్‌ లేకుండా చూసుకోవాలి. కొందరు తలగడ ఉన్నా దాని సపోర్ట్‌ సరిపోక మళ్లీ భుజాన్ని కూడా వాడుతుంటారు. ఇది కూడా సరికాదు. 

తలగడ ఎలా ఉండాలంటే... 

  • తలగడ మృదువుగా భుజాలు, తల పట్టేంత సైజులో ఉండాలి. కార్లలో ఉపయోగించే చిన్న తలగడలు పడక మీద నిద్రలో ఉపయోగించడం సరికాదు. 

  • తలగడను కేవలం తలకింద మాత్రమే అమరేలా కాకుండా... కొంత భాగం భుజాల కిందికీ వచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల స్పాండిలోసిస్‌ కారణంగా వచ్చే మెడనొప్పి నివారితమవుతుంది. 

  • స్పాండిలోసిస్, మెడనొప్పి, భుజాల నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు తమకు అనువైన తలగడను ఎంచుకొని, నిద్రకోసం దాన్నే వాడాలి. 

  • ఎవరి తలగడ వారికి వేరుగా ఉండాలి. 

  • తలగడ మీద ఉండే డస్ట్‌మైట్స్‌ తో కొందరికి అలర్జీలూ, ఆస్తమా కూడా రావచ్చు. అందుకే తలగడను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఉతికిన పిల్లోకవర్‌ తొడిగిన తలగడనే వాడాలి. 

పడక ఎలా ఉండాలంటే... 
వీపునొప్పితో బాధపడే చాలామంది పరుపు వాడకూడదని, గట్టి ఉపరితలం మీద పడుకోవాలన్న అపోహతో చెక్కబల్ల మీద పడుకుంటుంటారు. వాస్తవానికి అది మంచిది కాదు. మంచి పరుపు మీద పడుకోవడమే మంచిది. అది శరీరానికి గట్టిగా ఒత్తుకోకుండా ఉండేంత మృదువుగా ఉండాలి. అదేవిధంగా మనం అందులోకి కూరుకుపోయేటంత మెత్తగా ఉండకూడదు. గట్టి ఉపరితలం మీద పడుకుంటే ఒంట్లో చాలా భాగాలు నొక్కుకుపోయి, అలా నొక్కుకుపోయిన చోట్ల నొప్పి వచ్చే అవకాముంటుంది. 

అందుకే పరుపును ఎంపిక చేసే సమయంలో అది శరీరానికి ఒత్తుకోకుండా మృదువుగా ఉండటంతో పాటు మనం కూరుకుపోకుండా ఉండేలాంటి పరుపును తీసుకోవాలి. పరుపు వాడేటప్పుపడు ప్రతివారం దాన్ని తిరగవేయడం మంచిది. ఎందుకంటే ఒకేవైపు వాడుతుంటే శరీరం బరువు ఒకేచోట పడి అది తన ఎలాస్టిసిటీని కోల్పోయి, గుంటలా పడుతుంది. అందుకే మార్చి మార్చి వాడాలి. ఒక పరుపును మూడేళ్ల పాటు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఆ తర్వాత అవకాశముంటే  మార్చడమే మంచిది.

(చదవండి: డార్క్‌ చాక్లెట్‌ టైప్‌2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement