ఐరన్ డెఫిషియెన్సీ(ఐడిఏ)పై అవగాహన పెంచే క్రమంలో అంతర్జాతీయ పోషకాహార సంస్థ దానోన్ ఇండియా నిర్వహించిన కార్యక్రమం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఈ విషయాన్ని భాగ్యనగరంలోని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నగరంతో పాటు దేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య నిపుణులు రక్తహీనతను ఎదుర్కొనే విషయంలో పాలుపంచుకుంటామని ప్రమాణం చేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు వెల్లడించారు.
2025 నవంబర్‌లో ప్రారంభించిన ‘ఐరన్ అప్’ కార్యక్రమం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించారు. ఈ కాంపెయిన్‌లో భాగంగా వైద్యులు అవగాహన పెంపు, సమయానుకూల నిర్ధారణ, పోషకాహార ప్రాముఖ్యతపై కృషి చేయాలని సంకల్పించారు. పిల్లల వైద్యులు, జనరల్ ఫిజీషియన్లు సహా అనేక మంది వైద్య నిపుణులు కార్యక్రమంలో భాగమయ్యారు. ముఖ్యంగా గర్భిణులు, శిశువుల్లో రక్తహీనతను తగ్గించేందుకు డానోన్ ‘స్వస్థ మాత స్వస్థ బాలక్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని బీహార్‌లో అమలు చేస్తోంది. ఈ సందర్భంగా డానోన్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ ప్రియాంక వర్మ మాట్లాడుతూ.. ‘ఈ గుర్తింపు వైద్య సమాజం కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి మార్పు సాధ్యమో చూపిస్తుంది అని తెలిపారు.


