సంజీవనిగా పిలిచే మల్టీవిటమిన్‌ మొక్క గురించి తెలుసా..! | Health Benefits: Chakramuni or the multivitamin plant | Sakshi
Sakshi News home page

Chakramuni Plant: సంజీవనిగా పిలిచే మల్టీవిటమిన్‌ మొక్క గురించి తెలుసా..!

May 25 2026 10:39 AM | Updated on May 25 2026 11:11 AM

Health Benefits: Chakramuni or the multivitamin plant

శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఒకే మొక్కలో లభిస్తే.. దానిని సంజీవని అనవచ్చేమో. ‘చక్రముని ఆకు’ మొక్క అలాంటిదే అంటున్నారు ఔషధ, సుగంధ మొక్కల పరిశోధన కేంద్రం (సిమ్యాప్‌) శాస్త్రవేత్తలు. దీని శాస్త్రీయనామం ‘సారోపస్‌ ఆండ్రోజినస్‌’ కాగా.. మల్టీవిటమిన్‌ మొక్క అని కూడా పిలుస్తారు. ఇటీవల మన భాగ్యనగరం హబ్సిగూడలోని ఎన్‌జీఆర్‌ఐలో జరిగిన ప్రదర్శనలో ఈ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ మొక్క వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!.

ఈ మొక్క ఆకుల్లో ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఇనుము, కాల్షియం, పొటాషియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని పరిమితంగా, ఉడికించిన తర్వాతే తినాలి. కరివేపాకు మాదిరిగా ఆకులను వంటల్లో వేసుకోవచ్చు’’ అని పరిశోధకులు చెబుతున్నారు.

ఆయుర్వేదంలో దీని ప్రత్యేకత..
చక్రముని శాస్త్రీయ నామం నామసురోపస్ ఆండ్రోజినస్. ఆయుర్వేదం ప్రకారం.. ఇది ఇతర మొక్కల కంటే ఎంతో భిన్నమైనది. దీని ఆకులు స్వల్ప తీపి, వెచ్చని గుణాన్ని కలిగి ఉండి, శరీరంలోని వాత, కఫాలను సమతుల్యం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీన్ని సులభంగా చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చని చెప్పారు.

ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

  • విటమిన్ ఏ, బీ, సీ, కాల్షియం, ఐరన్‌లకు దీన్ని సహజ వనరుగా చెబుతారు నిపుణులు

  • దీని ఆకులను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, జీర్ణ ఎంజైమ్లు వేగంగా విడుదలయ్యి జీర్ణక్రియ బలపడుతుందన్నారు.

  • రక్తహీనతతో బాధపడేవారికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.

  • ఇది శరీరంలో విటమిన్ లోపాలను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

  • ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, ఊపిరితిత్తుల సమస్యలను, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది.

  • ఇందులో కొవ్వు, కేలరీలు చాలా తక్కువ. ఇది ఆకలిని నియంత్రించడమే కాకుండా శరీరానికి పూర్తి పోషణను అందిస్తుందన్నారు.

  • మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పారు.

అంతేగాదండోయ్‌ ఈ మొక్కను  హైదరాబాద్, బోడుప్పల్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) కేంద్రంలో రూ.20కే విక్రయిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యంగా తక్కువ ధరకు వెచ్చింది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుదామా..!.

(చదవండి: Health Benefits of Cucumber : పరగడుపునే కీరా తినొచ్చా..!?)
 

Advertisement
 
Advertisement
Advertisement