చవకగా దొరికేది అన్ని వేళలా లభించే కీరా దోసకాయతో కలిగే లాభాలు అన్ని ఇన్ని కావని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ. అందరికి దొరికే కీరాను పరగడుపున తింటే చాలామంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమ్మర్ ఉష్ణోగ్రతలకు ఇది ఎంతో పోషకవంతమైనదని అన్నారు. దీన్ని ఉదయమే అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఏంతో మేలని తెలిపారు. అంతేగాదు దీనిలో ఉండే పోషక విలులు, ఉపయోగాలు గురించి సవివరంగా వెల్లండించారు.
ప్రతిరోజు ఉదయం పరగడుపునే కీరా దోసకాయ లేదా కీరా జ్యూస్ తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకి వెళ్లిపోయి మలబద్ధకం సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుందని అన్నారు. అధిక బరువుతో బాధపడే వాళ్లకు ఎంతో మేలని అంటున్నారు. ముఖ్యంగా పొట్ట భాగంలో ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది, వడదెబ్బ బారిన పడకుండా కాపాడుతుందని చెబుతున్నారు.
అలాగే మధుమేహులు దీన్ని తీసుకోవడం వల్ల చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగ్గుఉంటుందని అన్నారు. కీరలక్ష అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుందని అన్నారు. దీనిలో ఉండే విటమిన్ సీ ఇమ్యూనిటీని పెంచి వ్యాధులు దరిచేరకుండా చేస్తుందని చెబుతున్నారు.
ఎలాగంటే..
శరీరానికి తేమ: కీరాలో సుమారు 95% నీరు ఉండటం వల్ల ఉదయాన్నే శరీరాన్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారించి, ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది.
బరువు నియంత్రణ: కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి అల్పాహారం.
రోగనిరోధక శక్తి: దీనిలోని విటమిన్ సీ, ఇతర యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి
అలాగే ఫైబ్రాయిడ్లు లేదా ఈస్ట్రోజెన్ ఆధిపత్యాన్ని ఎదుర్కొంటున్న మహిళలకు, ఇందులోని ఫైటోన్యూట్రియెంట్లు తేలికపాటి యాంటీ-ఈస్ట్రోజెనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే..రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని చెబుతున్నారు.
చర్మం, కళ్ళు, జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
రక్తపోటుని తగ్గిస్తుంది, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కూడా.
ఎవరు తీసుకోకూడదంటే..
దోసకాయ చల్లబరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఇది శరీరంలో కఫ దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. తరచుగా జలుబు, దగ్గు, శ్లేష్మం, సైనస్ సమస్యలు, ఉబ్బసం లేదా కఫంతో బాధపడేవారు కీరాను పూర్తిగా నివారించాలి.
ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ (IBS), జీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచిది కాదు
కీళ్ల నొప్పులు ఉంటే తినకపోవడమే మేలు
మూత్ర విసర్జనకి సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించే తీసుకుంటే మంచిది.
గ్లూకోజ్‌ని తగ్గించే మందలు ఉపయోగించే వాళ్లు కూడా వైద్యులను సంప్రదించే తీసుకోవాలని చెబుతున్నారు.
(చదవండి: చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ)


