Baldness Cure: గుడ్‌న్యూస్‌.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు పరిష్కారం..!

Harvard Study On Hair Growth Protein Which Cure Baldness Permanently - Sakshi

Permanent Solution To The Problem Of Baldness: అద్దం ముంచు నిలబడి నున్నని బట్టతల​ను నిమురుకుంటూ.. ఫ్చ్‌.. దీనికి  విరుగుడే లేదా (విగ్గుకాకుండా)? అని ఒక్కసారైనా అనుకోనివారుండరేమో..!అలాంటివారందరికీ అదిరిపోయే గుడ్‌ న్యూస్‌! మన శరీరంలో ఒక ప్రొటీన్‌ స్థాయిలను పెంచడం ద్వారా బట్టతల​ సమస్యకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పొచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇప్పుడిది సాధ్యమే అని చెబుతోంది కూడా.

బట్టతలతో ఎన్నో సమస్యలు
తలపై నిండుగా కనిపించే ఒత్తైన జుట్టు మగవాళ్లందరూ కోరుకుంటారు. కానీ నియంత్రణలేకుండా ఊడే జుట్టువారిలో ఇది తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తుంది. అందులోనూ వయసులో ఉన్నప్పుడే బట్టతల వస్తే జాబ్‌ ఇంటర్వ్యూలు, పెళ్లి సంబంధాల విషయాల్లో వీరికి ఇబ్బందులు మరీ ఎక్కువ. జుట్టురాలే సమస్యతోపాటు అనేక ఒత్తిడ్లవల్ల శరీరంలో కార్టిజాల్‌ హార్మోన్‌ (స్ట్రెస్‌ హార్మోన్‌) పెరుగుదలకు కారణమౌతుంది. ఫలితంగా తలలోని మాడు భాగానికి, వెంట్రుకల కుదుళ్లకు చెప్పలేని నష్టాన్ని కలిగిస్తుంది. మగవాళ్లలో మాత్రమేకాకుండా, స్త్రీలలో కూడా ఒత్తిడి హార్మోన్ బట్టతలకు కారణమౌతుంది. ఆందోళన, కోపం, యాంగ్జైటీ వంటి స్ట్రెస్‌ సంబంధిత ప్రతిచర్యలు బట్టతలకి కారణమౌతాయని పరిశోధకులు చెబుతున్నదే. 

ఈ ప్రొటీన్‌తో బట్టతలకు శాశ్వత పరిష్కారం
ఐతే హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నేచర్ మ్యాగజైన్‌లో తాజాగా ప్రచురించిన కథనం ప్రకారం.. ‘GAS6’ అనే ప్రొటీన్‌ జుట్టు పెరుగుదలను ప్రొత్సహించి, బట్టతలపై వెంట్రుకల పునరుత్పత్తికి సహాయపడుతుందని, బట్టతలకు శాశ్వత పరిష్కారం చూపగలుగుతుందని పేర్కొంది. జుట్టు ఊడిన ప్రదేశంలో కుదుళ్ల నుంచి కొత్త వెంట్రుకలు తిరిగి పెరగడానికి ఈ ప్రోటీన్ సహాయపడుతుందని చెబుతున్నారు. 

చదవండి: 1.5 లీటర్ల కోల్డ్‌ డ్రింక్‌ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే..

ఆ హార్మోన్‌ వల్లనే జుట్టు రాలుతుంది..
ఎలుకల్లో అడ్రినల్ గ్రంథులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం ద్వారా మూడు రెట్లు ఎక్కువగా వెంట్రుకలు పెరిగినట్లు వీరి పరిశోధనల్లో తేలింది. మూత్రపిండాల పైన ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్‌కు సమానమైన కార్టికోస్టెరాన్ అనే ఒత్తిడి హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఈ ఒత్తిడి హార్మోన్ ఎలుకల్లో పెరుగుదలను అణిచివేశాయని, ఈ హర్మోన్‌ను నియంత్రిస్తే హెయిర్‌ ఫోలిసిల్‌ స్టెమ్‌ సెల్‌ (హెచ్‌ఎఫ్‌సీ) యాక్టివేట్‌ అయ్యి కొత్త జుట్టు పెరగడానికి కారణమౌతుందని నివేదికలో తెల్పింది. దీంతో మొదటిసారిగా జుట్టు రాలడానికి గల కారణాలను శాస్త్రీయ ఆధారాలతో గుర్తించి, దానిని ఎలా తిప్పికొట్టాలో కూడా ఈ అధ్యయనాలు తెల్పాయి. 

మళ్లీ ఈ విధంగా జుట్టు పెరుగుతుంది
బట్టతల వ్యక్తుల్లో స్థబ్దంగా విశ్రాంతి స్థితిలో ఉండే హెయిర్ ఫోలికల్ మూలకణాలను ప్రోత్సహించడానికి GAS6 ప్రొటీన్‌ ఉపయోగపడుతుంది. ఎలుకల్లో ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ మనుషుల్లో దీని పనితీరుపై మరిన్ని అధ్యయనాలు చేయాల్సిఉందని పరిశోధన బృంధం తెల్పింది.

వీరి ప్రయోగాలు ఫలిస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి బట్టతల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పవచ్చు.

చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top