లేక్‌ పక్కనే బొమ్మరిల్లు లాంటి గ్రామం..! | Hallstatt Austria A Guide to Austria's Fairytale Lake Town | Sakshi
Sakshi News home page

లేక్‌ పక్కనే బొమ్మరిల్లు లాంటి గ్రామం..!

Apr 27 2026 2:42 PM | Updated on Apr 27 2026 2:53 PM

 Hallstatt Austria A Guide to Austria's Fairytale Lake Town

మనం చిన్నప్పుడు చూసిన ఫైయిరీ టేయిల్స్‌లో ఉండే గ్రామాలు నిజంగా ఉంటాయా అని ఎప్పుడైనా అనిపించిందా? హాల్‌స్టాట్‌కి వెళ్లినప్పుడు మనకి ఆ ఫీలింగే కలుగుతుంది. లేక్‌ పక్కనే ఉన్న హౌజెస్‌ చూస్తుంటే మనం ఏదో ఒక అందమైన పిక్చర్‌ ఫ్రేమ్‌లో ఉన్నాము అనే ఫీలింగ్‌ వస్తుంది. ఫస్ట్‌ టైమ్‌ ట్రావెలర్స్‌కి ఇది ఒక డ్రీమ్‌ డెస్టినేషన్‌  మాత్రమే కాదు, మనసుకి ప్రశాంతతను ఇచ్చే చక్కని ప్రదేశం.

ఆస్ట్రియాలోని స్నో మౌంటెన్స్‌ అండ్‌ హాల్‌స్టాట్‌ లేక్‌ వాటర్‌ మధ్య పోల్చిచూస్తే మనకి ఒక కొత్త కోణంలో చూసే అవకాశం లభిస్తుంది. కొండాకోనల్లో నుంచి లేక్‌ వైపు చూస్తూ కూర్చోవడం ఒక పెద్ద రిఫ్లెక్షన్‌. ఇక్కడి నారో స్ట్రీట్స్‌లో నడుస్తుంటే నేచర్‌ సౌండ్స్‌ తప్పా ఇంకేమీ వినిపించవు. ప్రతీ ఇల్లు పూలతో అలంకరించుకుని ఉంటుంది. వుడెన్‌ ఆర్కిటెక్చర్‌తో చాలా అందంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఒక కళాత్మక వాతావరణం కనిపిస్తుంది.

సందర్శనీయ స్థలాలు
ఇక్కడ ఉన్న సాల్ట్‌ మైన్‌ టూర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దీని హిస్టరీ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. స్కైవాక్‌ వ్యూ ఫ్లాట్‌ఫామ్‌ నుంచి విలేజ్‌ మొత్తం చూస్తుంటే వ్యూ చాలా బాగుంటుంది. హాల్‌స్టాట్టర్‌ లేక్‌లో బోటింగ్‌ చేస్తూ చుట్టూ ఉన్న పర్వతాలను ఆ నీటిలో నుంచి చూడటం అనేది మర్చి΄ోలేని అనుభూతిగా మిగిలి΄ోతుంది.

ఏం తినాలి?
లోకల్‌గా వెతికి ఫ్రెష్‌ డిషెస్‌ను ఆస్వాదిస్తే ఆ ఫ్రెష్‌నెస్‌ ఏంటో తెలుస్తుంది. దీంతో΄ాటు ఇక్కడి ట్రెడిషనల్‌ పేస్ట్రీస్‌ అండ్‌ హాట్‌ కాఫీ తింటూ లేక్‌ సైడ్‌ కూర్చోవడం ఒక స్పెషల్‌ ఎక్స్‌పీరియె¯Œ ్సగా మిగిలిపోతుంది.

ఎప్పుడు వెళ్లాలి ? 

ఏప్రిల్‌ అండ్‌ మే నెలల్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది ఈ సమయంలోనే ట్రిప్‌ ప్లాన్‌ చేస్తుంటారు. స్థానిక అందాలు చూడచక్కగా కనిపిస్తాయి.

మార్నింగ్‌ సమయంలో బయటకు వస్తే క్రౌడ్‌ తక్కువగా ఉంటుంది. ఇక్కడి లోకల్స్‌ చాలా కామ్‌గా ఉంటారు. ట్రావెల్‌ కంఫర్ట్‌ చాలా ఎక్కువ. సింపుల్‌గా నడుస్తూ ఈ విలేజ్‌ అందాలు చూస్తుంటే టైమ్‌ సైన్సు తెలియదు.

హైదరాబాద్‌ నుంచి ఎలా వెళ్లాలి?

హైదరాబాద్‌ నుంచి వియన్నాకి కనెక్టింగ్‌ విమానాలు ఉంటాయి. వియన్నా నుంచి ట్రెయిన్‌ లేదా కార్‌ జర్నీ ద్వారా 3 నుంచి 4 గంటల్లో  హాల్‌స్టాట్‌ చేరుకోవచ్చు.

హాల్‌స్టాట్‌ మనల్ని స్లో ట్రావెల్‌ వైపు తీసుకెళ్తుంది. ప్రతీ క్షణం ఎంజాయ్‌ చేయాలి అనే ఫీలింగ్‌ కలిగిస్తుంది. ఇక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా ఆ లేక్‌ అండ్‌ అందమైన ఇళ్లు మనకి ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటాయి. 

(చదవండి: పచ్చని స్వర్గధామం..సమ్మర్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement