మామిడి పండ్ల వినియోగంపై ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ హెచ్చరిక! కెమికల్‌ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించాలంటే.. | FSSAI Warns Against Usage Of Calcium Carbide For Ripening | Sakshi
Sakshi News home page

మామిడి పండ్ల వినియోగంపై ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ హెచ్చరిక! కెమికల్‌ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించాలంటే..

May 20 2024 11:41 AM | Updated on May 20 2024 11:43 AM

FSSAI Warns Against Usage Of Calcium Carbide For Ripening

వేసవి కాలం అంటే నోరూరించే మామిడి పండ్ల సీజన్‌. వీటిని ఇష్టపడని వారెవ్వరుంటారు. అయితే ఆ మామిడి పండ్లను కృత్రిమంగా పండించడంపై ఫుడ్‌ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ) వ్యాపారస్తులను, పండ్ల వ్యాపరులను ఆహార భద్రత ప్రమాణలు పాటించాని పేర్కొంది. చట్టవిరుద్ధంగా కాల్షియం కార్పైడ్‌ వంటి రసాయనాలను వినియోగించకూడదని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆరోగ్య అధికారులు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అసలు కృత్రిమంగా మామిడి పండ్లను పండించేందుకు ఏం ఉపయోగాస్తారు? కెమికల్‌ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించగలం తదితరాలు గురించి తెలుసుకుందాం.!

కాల్షియం కార్బైడ్ అంటే..
మామిడిపండ్లు తొందరగా పక్వానికి వచ్చేలా కాల్షియం కార్బైడ్‌ వంటి కెమికల్స్‌ని వినియోగిస్తారు. దీనిలో ఫాస్పరస్‌ జాడలు కలిగి ఉన్న ఎసిటిలీన్‌ వాయవుని విడుదల చేస్తుంది. అందువల్ల ఈ రసాయనాలతో పండించిన మామిడి పండ్లు ఆరోగ్యానికి హానికరం. ఇలా పండించిన పండ్లను తీసుకోవడం వల్ల తలనొప్పి, తరుచుగా దాహం, చికాకు, బలహీనత, మింగడంలో ఇబ్బంది. వాంతులు, చర్మపు పూతలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. 

అందువల్ల ఇలాంటి కెమికల్స్‌ వినియోగాన్ని నిషేధించింది. 2011 రెగ్యులేషన్‌ నిబంధనల ప్రకారం కృత్రిమంగా పండించేందుకు కాల్షియ కార్బైడ్‌ వినియోగించొద్దని తెలిపింది. ప్రత్యామ్నాయంగా ఇథిలిన్‌ వాయువును ఉపయోగించొచ్చని తెలిపింది. ఇథిలిన్‌ వాయువు కార్బైడ్‌ వాయువుకు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా పేర్కొంది. ఇది పండును సహజంగా పండేలా ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ఇథిలిన్‌ వాయువుని గణనీయమైన పరిమాణంలోనే వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది పంట రకం, పరిపక్వత ఆధారంగా ఎంత మేర వినయోగించాలనేది నిర్ణయించడం జరుగుతుంది. చాలా వరకు సుమారు 100 పీపీఎంల వరకు వినియోగించేలా అనుమతి ఇచ్చింది ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ. 

దీన్ని ఎలా గుర్తించాలంటే..
ఇక్కడ మామిడి పండ్లు కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను పండించారా? లేదా సహజమైన రీతీలో పండాయా అనేది ఎలా గుర్తించాలంటే..అందుకు నాలుగు సింపుల్‌ చిట్కాల ఉన్నాయి. అవి ఫాలో అయిపోండి. అవేంటంటే..

ఆకృతిని పరిశీలించటం: మామిడిపండ్లు అసహజంగా ఏకరీతిగా కనిపించి చుట్టూ ఈగలు, కీటకాలు లేకుంటే వాటికి ఘాటైన రసాయనాలను కలిపారని అర్థం. 
వాటర్‌ పరీక్ష: కృత్రిమంగా పండిన మామిడి పండ్లు నీటిపై తేలుతుంది. కాబట్టి కొనుగోలు చేసిన తర్వాత మామిడికాయలను ఒక బకెట్‌ నీటిలో ఉంచండి. అవి సేంద్రియంగా పండించారా లేదా అన్నది తెలిసిపోతుంది. 
టేస్టీని బట్టి: కృత్రిమంగా పండిన మామిడిపండ్లు సేంద్రీయ వాటితో పోల్చితే తక్కువ జ్యూసీ, తక్కువ బరువుని కలిగి ఉంటాయి. 
అగ్గిపుల్ల టెస్ట్‌: ఈ పరీక్ష అత్యంత భద్రతతో నిర్వహించాల్సి ఉంటుంది. అగ్గిపుల్లను వెలిగించి మామిడి పండ్ల దగ్గరకు తీసుకువస్తే..మంటలు లేదా మెరుపులో కూడిన మంట వెదజల్లిన కాల్షియం కార్బైడ్‌ వినియోగించి మాగబెట్టారని అర్థం.  

(చదవండి: హిమ శిఖరాల్లో పెళ్లి సందడి!..వణికించే చలిలో ఫోజులిస్తున్న జంట!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement