చిన్నవాళ్లైనా... తప్పులు మన్నించమని కాళ్లపై పడతారు! | Sakshi
Sakshi News home page

చిన్నవాళ్లైనా... తప్పులు మన్నించమని కాళ్లపై పడతారు!

Published Wed, Mar 13 2024 11:43 AM

 Family touch the feet of the DAUGHTER and ask forgiveness Kutch Patel community of Gujarat - Sakshi

భారతదేశంలో అనే వివాహ ఆచారాలు,సంప్రదాయాలు ఆచరణలో ఉన్నాయి. చట్టబద్ధంగా చేసుకునే రిజిస్టర్‌ పెళ్లిళ్లు, వరుడి కాళ్లు   కడిగి కన్యాదానం చేయడం అనేది ప్రధానంగా చూస్తాం.  అలాగే అల్లారుముద్దుగా పెంచుకున్న  కుమార్తెను అత్తారింటికి  పంపించే సన్నివేశం  ఆమె కుటుంబ సభ్యుల్ని  మాత్రమే కాదు అక్కడనుంచి వారందరి చేత కన్నీరు పెట్టిస్తుంది.  తాజాగా గుజరాత్‌లోని ఒక వివాహ  ఆచారం  కూడా ఇదే కోవలో నిలిచింది. 

గుజరాత్‌లోని కచ్‌ పటేల్‌  కమ్యూనిటీ సంప్రదాయం ప్రకారం కుమార్తె  వివాహ సమయంలో,కుటుంబ సభ్యులందరూ పెళ్లి కుమార్తె కాళ్లు మొక్కుతారట. ఆమె పట్ల ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమించమని అందరూ అడుగుతారట. అలా ఆమె పాదాలను తాకి మన్నించమని వేడుకొని ఆమె పట్ల సంస్కారాన్ని గౌరవాన్ని చాటుకుంటారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి  ప్రస్తుతం  ట్విటర్‌లో షేర్‌ అవుతోంది.  రాము జీఎస్‌వీ ట్విటర్‌ హ్యాండిల్‌లో ఇది షేర్‌ అయింది.

Advertisement
 
Advertisement
 
Advertisement