వ్యర్థాలకూ వైద్యం | Dentist-turned-activist Dr Shanthi Tummala helped over 1 lakh Bengaluru residents | Sakshi
Sakshi News home page

వ్యర్థాలకూ వైద్యం

Mar 24 2026 3:47 AM | Updated on Mar 24 2026 3:47 AM

Dentist-turned-activist Dr Shanthi Tummala helped over 1 lakh Bengaluru residents

స్ఫూర్తి

డెంటిస్ట్‌గా క్షణం తీరికలేనంత బిజీగా ఉండే డాక్టర్‌ శాంతి తుమ్మల, బెంగళూరు నగరంలోని చెత్త కుప్పలను చూసి బాధపడేవారు. అధికారులకు ఫిర్యాదు చేసి ఊరుకోవడం కాకుండా ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. బస్సు, ట్రైన్, బస్‌స్టేషన్, చౌరస్తా... ఇదీ అదీ అని తేడా లేకుండా తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘ఎందుకు డాక్టరమ్మా ఇది నీకు’ అన్నారు చాలామంది. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి తన వృత్తిని వదులుకొని పూర్తిస్థాయి ప్రచార కార్యకర్తగా మారారు. లక్షలాది మందిలో మార్పు తీసుకువచ్చారు...

బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్‌ లే అవుట్‌లో నివసిస్తున్న శాంతి తన ఇంటిసమీపంలో ట్రక్కుల నిండా చెత్తను చూసేవారు. ఆ చెత్తగుట్టలు ఆమెను తీవ్రంగా కలవర పరిచేవి. సమస్య పరిష్కారానికి తానే నడుం బిగించాలని నిర్ణయం తీసుకున్నారు. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి అనుభవం లేకపోయినా, ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో రంగంలోకి దిగారు. ఇంటింటికి వెళ్లి తడి చెత్త, ΄÷డి చెత్త, ప్రమాదకరమైన వ్యర్థాలను ఎలా వేరు చేయాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

అయితే... చాలామంది డాక్టర్‌ శాంతి మాటలకు అసహనంగా ముఖం పెట్టేవాళ్లు. కొందరికి ఆమె చెప్పింది వినడం టైమ్‌ వేస్ట్‌గా అనిపించేది. ‘పబ్లిసిటీ కోసమే ఈ ప్రచారం చేస్తుంది’ అని కొందరు చెవులు కొరుక్కున్నారు. ఎందరు ఎన్ని రకాలుగా అనుకున్నా ఆమె వెనకడుగు వేయలేదు. ఆమె కష్టం వృథా పోలేదు. హెచ్‌ఎస్‌ఆర్‌ సిటిజన్‌ ఫోరమ్‌ ద్వారా లక్షమందికి పైగా వ్యర్థాల విభజనలో సహాయపడ్డారు. ఆమె తన ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడానికి ‘కంపోస్ట్‌ లెర్నింగ్‌ సెంటర్‌’ కూడా 
్రపారంభించారు.

మై వేస్ట్‌ మై మేనేజ్‌మెంట్‌
కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా, ఆచరణాత్మక ప్రచారం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు డాక్టర్‌ శాంతి. తన ఇంట్లోకి ΄్లాస్టిక్‌ను అనుమ
తించరు. గుడ్డ సంచులను ఉపయోగిస్తారు. పాత చీరెలు ధరిస్తారు. నిల్వ చేయడానికి స్టీల్‌ డబ్బాలనే వాడతారు.
‘మై వేస్ట్‌ మై మేనేజ్‌మెంట్‌’ అనేది శాంతి నినాదం.
ప్రజలు వ్యర్థాలను వేరు చేయడం ప్రారంభించినప్పటికీ, సేకరణ సమయంలో కాంట్రాక్టర్లు వాటన్నింటినీ మళ్లీ కలిపేస్తున్నారని ఆమె గమనించి, అలా జరగకుండా ఉండడానికి అధికారుల సహకారం తీసుకున్నారు.

వృత్తిని త్యాగం చేసి...
వృత్తిని, సామాజిక కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడం డా. శాంతికి కష్టంగా మారింది. క్లినిక్‌లో రాత్రంతా పనిచేయడం వల్ల ఆమె అలసిపోయేవారు. ఇలా అయితే కుదరదనుకొని వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ఉద్యోగం వదులుకోవాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
తన పట్టుదలతో పరిసర ప్రాంతాలను మాత్రమే కాకుండా, ఎంతోమంది 
బెంగళూరు వాసుల ఆలోచనా విధానాన్ని మార్చారు.

ఉమ్మడి బాధ్యత
తన ప్రచారానికి బస్సులను కూడా వేదికగా ఉపయోగించుకుంటారు డా.శాంతి. ఇటీవల వైరల్‌ అయిన ఒక వీడియోలో బస్సులో నిలబడి ‘దయచేసి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయవద్దు’ అని ప్రయాణికులకు విన్నపం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ‘నగరాన్ని శుభ్రంగా ఉంచడం మనందరి ఉమ్మడి బాధ్యత’ అని ఒకటికి రెండు సార్లు చెబుతుంటారు. వ్యర్థాల విభజన అనేది సక్రమంగా జరగడం ప్రారంభమైన తరువాత ఆమె కంపోస్టింగ్‌పై దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement