Beard Shaving: రోజూ షేవింగ్‌ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే!

Benefits Of Shaving Beard Daily Why Should Shave Everyday - Sakshi

ప్రస్తుత కాలంలో నున్నగా షేవ్‌ చేసుకునే వారికంటే నిండుగా గడ్డం పెంచుకునే వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. గడ్డం పెంచుకోవడం... లేదా రెగ్యులర్‌గా షేవింగ్‌ చేసుకోవడం... ఎవరిష్టం వాళ్లది. అయితే రోజూ షేవింగ్‌ చేసుకోవడం వల్ల కొన్ని లాభాలున్నాయి. అవేంటో చూద్దాం.. 

కొన్ని ఇంటర్వ్యూలకు హాజరయ్యేటప్పుడు నీట్‌గా షేవింగ్‌ చేసుకుని రమ్మనడం మామూలే. మిలటరీలో అయితే రెగ్యులర్‌ షేవింగ్‌ తప్పనిసరి. ఇంతకీ రెగ్యులర్‌ షేవింగ్‌ లాభాలేమిటంటారా... అక్కడికే వస్తున్నాం...

►షేవింగ్‌ చేసుకోవడం వల్ల యంగ్‌గా... ఎనర్జిటిక్‌గా కనిస్తారు. ముఖంపై ఉండే జుట్టు శుభ్రపడుతుంది.
►ఇది చర్మ సమస్యలను కొన్నింటిని తగ్గిస్తుంది. అలాగే చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది.
►షేవింగ్‌కు సంబంధించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉదయం నిద్రలేచి షేవింగ్‌ చేసుకునే వారు మరింత ఉత్సాహంగా ఉంటారట.

బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి..
►అలాగే పనులకు వెళ్లే వారు ఉదయాన్నే షేవ్‌ చేసుకోవడం వల్ల ఆ పనిని సక్రమంగా.. మరింత సామర్థ్యంతో పనిచేస్తారని కొన్ని పరిశోధనలలో తేలింది. 
►గడ్డంలో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఇది చర్మాన్ని పాడుచేస్తుంది. దీంతో ముఖంపై మచ్చలు ఏర్పతాయి. రోజూ షేవింగ్‌ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా తొలగిపోతుంది. 
►షేవింగ్‌ చేసేటప్పుడు ఉపయోగించే ప్రీషేవ్‌ ఆయిల్, షేవింగ్‌ క్రీమ్, జెల్‌  లేదా బామ్‌ వంటివన్నీ మీ చర్మ పీహెచ్‌ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.

చదవండి: Hair Fall Control: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా! 
Health Tips: తరచు ఒళ్లు నొప్పులా? కారణాలు తెలుసుకోండి.. అంతేగానీ వెంటనే టాబ్లెట్‌ వేసుకుంటే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top