Health Tips: తరచు ఒళ్లు నొప్పులా? కారణాలు తెలుసుకోండి.. అంతేగానీ వెంటనే టాబ్లెట్ వేసుకుంటే!

తరచు ఒళ్లు నొప్పులా? కారణాలు ఇవి కావొచ్చు..!
కొంతమంది ఎప్పుడూ బాడీ పెయిన్స్‌తో ఇబ్బంది పడుతుంటారు. అసలు ఇవి ఎందుకు వస్తాయన్న సంగతి చాలా మందికి తెలియదు. కానీ ఈ నొప్పులు ఏ పనులను చేయనీయవు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయో తెలుసుకుందాం...
నిద్రలేమి
మనం 6 నుంచి 8 గంటలు పడుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఎందుకంటే నిద్రపోయేటప్పుడే శరీరం శక్తి వనరులను పునరుత్పత్తి చేసుకుంటుంది. నిద్ర మనల్ని రీఫ్రెష్ చేస్తుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరం శక్తి వనరులను భర్తీ చేసుకోక పోవడంతో ఒళ్ళు నొప్పులు వస్తాయి.
డీహైడ్రేషన్
శరీరంలో నీరు తగ్గిపోవడం ఒళ్లు నొప్పులకు దారితీస్తుంది. శరీరానికి అవసరమైన నీటిని తాగకపోవడం.. దానికితోడు శరీరంలోంచి నీరు బయటకు పోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడతారు. దీనివల్ల అలసట, ఒళ్లంతా నొప్పులు వస్తాయి.
ఐరన్ లోపం
రక్తంలో ఐరన్ చాలా ముఖ్యమైన మూలకం. ఇది తక్కువ మొత్తంలో ఉండటం వల్ల శరీరంలోని వివిధ భాగాలకు పోషకాలు, ఆక్సిజన్ సరిగ్గా అందవు. దీనివల్ల అలసటతో పాటుగా బాడీపెయిన్స్ కూడా వస్తాయి.
ఆర్థరైటిస్
ఆర్థరైటిస్ లేదా కీళ్ల వాపు సమస్యలు వల్ల ఒళ్లు నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తగ్గించుకుంటే బాడీ పెయిన్స్ తగ్గుతాయి.
జలుబు, ఫ్లూ
చలి, వానకాలాల్లో జలుబు, ఫ్లూ సమస్యలు సర్వసాధారణం. అయితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా విపరీతంగా ఒళ్లు నొప్పులు వస్తాయి.
మానసిక ఒత్తిడి
ఒత్తిడి మనల్ని శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి ఎక్కువైతే శరీరం బాగా అలసిపోతుంది. దీంతో మీరు మరింత బలహీనంగా మారిపోతారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. దీంతో శరీరం ఎన్నో రోగాలకు ఆవాసంగా మారుతుంది. ఇవన్నీ ఒంటి నొప్పులకు కారణం అవుతాయి.
విటమిన్ డి లోపం
మన శరీరం సక్రమంగా పనిచేయడానికి విటమిన్ డి చాలా అవసరం. ఇది ఎముకలను, దంతాలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. విటమిన్ డి మన శరీరంలో లోపిస్తే ఒళ్లు నొప్పులు తరచు వేధిస్తుంటాయి.
పై వాటిలో మన సమస్య ఏమిటో తెలుసుకుని దానికి తగిన చికిత్స చేయించుకోవడం వల్ల ఒళ్ళు నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకానీ బాడీ పెయిన్స్ రాగానే పారాసిటమాల్ లేదా ఎసిక్లోఫినాక్ వేసుకోవడం వల్ల తగిన ఫలితం రాదు.
నోట్: ఆరోగ్యం పట్ల అవగాహన కొరకు మాత్రమే ఈ కథనం.
చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే..
ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే!
Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం!
సంబంధిత వార్తలు