ఒత్తిడితో బాధపడేవాళ్లకి ఇన్‌స్టంట్‌ సొల్యూషన్‌..హాయిగా నిద్రపడుతుంది

Benefits Of Hand Free Head Massager For Scalp Relaxation - Sakshi

మనసు ఆహ్లాదంగా ఉంటేనే మొహం మెరుస్తుంది. అలసట లేని అందం కావాలంటే.. హ్యాండ్స్‌–ఫ్రీ హెడ్‌ మసాజర్‌ మీ ఇంట్లో ఉండాల్సిందే. ఈ ఎలక్ట్రిక్‌ స్కాల్ప్‌ మసాజర్‌.. మొత్తం నాలుగు వైబ్రేషన్‌ మోడ్స్‌తో పనిచేస్తుంది. దీన్ని తలకు పెట్టుకుంటే.. రక్త ప్రసరణ పెరుగుతుంది. నిద్రలేమి దూరమై.. హాయిగా నిద్రపడుతుంది. అలసట మాయమవుతుంది.ఉద్యోగులు, డ్రైవర్లు, క్రీడాకారులు, వృద్ధులు, అలసటతో ఉన్న వారు, కార్మికులు, తలనొప్పి లేదా ఒత్తిడితో బాధపడుతున్న వాళ్లందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది.

యాక్టివ్‌ మోడ్, రిలాక్స్‌ మోడ్, బ్యూటీ మోడ్, స్లీప్‌ మోడ్‌ ఇలా.. ప్రతి మోడ్‌ భిన్నంగా ఉంటుంది. కావల్సిన ఆప్షన్‌ను ఈజీగా ఎంచుకోవచ్చు.  చూడటానికి సాలెపురుగులా ఉన్న ఈ మసాజర్‌ పొడవాటి పది ఫ్లెక్సిబుల్‌ టూల్స్‌.. చేతి వేళ్ల మాదిరిగా తలను పట్టి ఉంచుతాయి. లోపలి భాగంలో బాల్స్‌ లాంటి మెత్తటి నాలుగు టూల్స్‌ ఉంటాయి. వాటన్నిటి నుంచి తలకు మృదువైన వైబ్రేషన్‌ లభిస్తుంది. సుమారు 15 నిమిషాలు దీన్ని వాడితే మంచి ఫలితం ఉంటుంది.

అన్ని తెలిసిన స్టార్టర్స్‌కైనా.. ఆప్షన్స్‌ పెద్దగా తెలియని పెద్దవాళ్లకైనా దీని వాడడం సులభం.  మెషీన్‌ను స్టార్ట్‌ చేయడానికి  లేదా షట్‌ డౌన్‌ చేయడానికి పవర్‌ బటన్‌ ను 3 సెకన్ల పాటు నొక్కి ఉంచాలి. మోడ్‌ మారడానికి అదే బటన్ ఉపయోగపడుతుంది. హైక్వాలిటీ సిలికాన్‌తో రూపొందిన ఈ డివైజ్‌ చాలా తేలికగా.. ఎక్కడికైనా తీసుకెళ్లడానికి ఈజీగా ఉంటుంది. డిజైన్‌ను బట్టి దీని దీని ధర ఉంటుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top