Octopus Unknown Facts: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!!

8 Interesting Facts About Octopuses In Telugu - Sakshi

Interesting Facts In Telugu About Octopuses: మన పురాణాలు, కథల్లో ఆక్టోపస్‌ను గ్రహాంతర జీవిగా చెప్పుకోవడం వినేవుంటారు. అందుకు కారణం దాని శరీరం రూపం వింతగా ఉండటమే! ఏ జీవిలో లేని ఎన్నో వింతలు, విశేషాలు దీనికి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

సహజంగా జపాన్, అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న అలూటియన్ దీవుల్లో జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్‌లు అధికంగా కనిపిస్తాయి.

Octopus Unknown Facts

ఆక్టోపస్‌ చుట్టూ కదులుతూ ఉండే 8 చేతులకు ఒక్కో మెదడు చొప్పున ఉంటుంది. కంట్రోల్‌ మూవ్‌మెంట్‌ మధ్యలో ఉండే ప్రధాన మెదడు నియంత్రిస్తుంది. చేతులన్ని స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ ఒకే లక్షంతో కదులుతాయని జీవశాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఆక్టోపస్‌కు ఏకంగా మూడు గుండెలు ఉంటాయి. వీటిలోని రెండు గుండెలు మొప్పలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. వీటికంటే పెద్దగా ఉండే ప్రధాన గుండె మిగతా శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.

Interesting Facts About Octopuses

జెయింట్ పసిఫిక్ ఆక్టోపస్‌లో కాపర్‌ అధికంగా ఉండే  హిమోసైనిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. ఈ ప్రొటీన్‌ చల్లని సముద్రం నీళ్లలో కూడా ఆక్సిజన్‌ సరఫరా చేసే సామర్ధ్యాన్ని ఇస్తుంది.

ఈ ఆక్టోపస్‌లో క్రొమటోఫోర్స్‌ అనే ప్రత్యేక ద్రవ్యం ఉంటుంది. దీని సహాయంతో అవసరమైనప్పుడు రంగు, ఆకారాన్ని కూడా మార్చుకోగలవు.

Octopus Facts In Telugu

ఇతర సముద్ర జీవులు ఆక్టోపస్‌లను వేటాడేటప్పుడు తమని తాము రక్షించుకోవడానికి విషపూరితమైన ద్రవాన్ని వాటిపై చిమ్మి, గందరగోళానికి గురిచేస్తాయి.

ఆక్టోపస్‌ చేతులపై బొడిపెల్లాంటి పిలకలుంటాయి... గమనించారా? ఐతే ఆడ ఆక్టోపస్‌లకు ప్రతి చేతిపై ఇవి 280 ఉంటాయి. మగ ఆక్టోపస్‌లకు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటాయి.

Octopus Brains And Hearts

ఆడ ఆక్టోపస్‌లు సముద్రం అడుగు భాగంలో గుడ్లు పెట్టి, 7 నెలలు ఆహారం తీసుకోకుండా పొదుగుతాయి. పిల్లలు పుట్టగానే మరణిస్తాయి. 

చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్‌ అటాక్స్‌ అధికంగా సంభవిస్తాయి..!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top