
ఈ కాలంలో రక్త నాళాలను కుచించుకుపోయి, శరీరానికి ఆక్సిజన్ సరిపడినంతగా చేరవేయడంలో ఇబ్బందులు..
Why do heart attacks become common during winters? ప్రస్తుత కాలంలో గుండెపోటు కూడా అత్యంత సాధారణ మరణాల్లో ఒకటిగా చేరిపోయింది. ఒకప్పుడు 50 యేళ్లు దాటిన వారికి వచ్చే హార్ట్ అటాక్.. ఇప్పుడు 20, 30, 40 ఏళ్ల వారికి కూడా వస్తున్నాయి. అందుకు అనేకానేక కారణాలతోపాటు కాలానుగుణ మార్పులు కూడా మీ హృదయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
ముఖ్యంగా శీతాకాల వాతావరణం తరచుగా గుండెపోటులు రావడానికి కారణమౌతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కాలంలో కేవలం శ్వాసకోశ వ్యాధులు మాత్రమేకాకుండా గుండె జబ్బుల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు హఠాత్తుగా తగ్గడం వల్ల ఆకస్మిక గుండెపోటులు సంభవిస్తాయట. కాబట్టి ఇతర సీజన్ల కంటే చలికాలం మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.
చలికాలంలో గుండెపోటు సంభవించడానికి గల ప్రధాన కారణాలు
శీతాకాలంలోనే ఎందుకు గుండెపోటు ప్రమాదాలు అధికంగా సంభవిస్తున్నాయనేదానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. చాలా మంది నిపుణులు గుండెపోటులు పెరగడానికి శరీర ఉష్ణోగ్రత కూడా ఒక కారణమనని అంటున్నారు. ఉష్ణోగ్రతల తగ్గుదల గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకే చలికాలంలో స్ట్రోకులు, ఆకస్మికంగా గుండె ఆగిపోవడం, గుండె సమస్యలు, అరిథ్మియా.. వంటి రుగ్మతలు సంభవిస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
చలికాలంలో శరీరం నాడీ వ్యవస్థ క్రియాశీలతలో మార్పులు చోటుచేసుకోవటం వల్ల, రక్త నాళాలను కుచించుకుపోతాయి. దీనిని ‘వాసోకన్‌స్ట్రిక్షన్’ అని పిలుస్తారు. ఇది జరిగినప్పుడు రక్తపోటు స్థాయి పెరిగడంవల్ల, శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని పంప్ చేయడంలో గుండె ఎక్కువగా కష్టపడి పని చేస్తుంది. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, శరీరం వేడిని నియంత్రించడానికి గుండె రెట్టింపు కష్టపడాల్సి ఉంటుంది. ఇది గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. గుండెపోటు సమస్యలున్నవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో శరీరానికి ఆక్సిజన్ అవసరాలు కూడా పెరుగుతాయి. రక్తనాళాల సంకోచం వల్ల, తక్కువ మొత్తంలో ఆక్సిజన్ గుండెకు చేరుతుంది. ఇది గుండెపోటుకు ఆస్కారన్నిస్తుంది.
ఈ జాగ్రత్తలు పాటించారంటే మీ హృదయ ఆరోగ్యం పదిలంగా..
►ఈ కాలంలో శారీరకంగా చురుకుగా లేకపోవడం కూడా ఒక కారణమే. తేలికపాటి వ్యాయామాలు చేయడం మరచిపోకూడదు.
►కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ధమనులపై ప్రభావం పడి గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది.
►మధుమేహం, బీపీ ఇతర సమస్యలున్నవారు తరచూ స్థాయిలను తనిఖీ చేసుకుంటూ ఉండాలి.
►మద్యం, పొగాకు వినియోగాన్ని తగ్గించాలి.
►ఏదైనా చికాకు, ఛాతీలో భారం, చెమట, భుజం నొప్పి, దవడ నొప్పి, తల తిరగడం, వికారం వంటి వాటిని తేలికగా తీసుకోకూడదు. వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
చదవండి: World's Largest Cemetery: ఇది నగరంలోని శ్మశానం కాదు.. శ్మశానమే ఓ మహానగరంగా! ఎక్కడుందో తెలుసా?