60 ఏళ్ల తల్లి వెయిట్‌లాస్‌ స్టోరీ..! దెబ్బకు థైరాయిడ్‌, షుగర్‌.. | 60 year old woman going to the gym for 1 year helped her lose 18 kg | Sakshi
Sakshi News home page

60 ఏళ్ల తల్లి వెయిట్‌లాస్‌ స్టోరీ..! దెబ్బకు థైరాయిడ్‌, షుగర్‌..

May 28 2026 3:51 PM | Updated on May 28 2026 3:57 PM

60 year old woman going to the gym for 1 year helped her lose 18 kg

పెద్దవాళ్లు అందులోనూ ఇంట్లోనే ఉండే తల్లులు బరువు తగ్గే ప్రయత్నాలు చేసేందుకు సిగ్గుపడుతుంటారు. అందులోనూ ఈ వయసులోనా..! అనే భయం వాళ్లను వెంటాడుతుంటుంది. ఓ అమ్మ ఆ మూసధోరణిని బద్దలుకొట్టేలా..జిమ్‌కి వెళ్లి ఏకంగా 18 కిలోలు తగ్గింది. అంతేగాదు ఎన్నాళ్లుగానో వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులకు సైతం చెక్‌ పెట్టింది. అదెలాగో తెలుసుకుందామా..!.

కంటెంట్ క్రియేటర్ హరీష్ ఠాకూర్  తన తల్లి స్ఫూర్తిదాయకమైన వెయిట్‌లాస్‌ జర్నీని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. తాను ఎన్నోసార్లు తన తల్లికి వ్యాయామాలు చేయమని చెప్పినా..ఆమె సామాజిక ఒత్తిడి, ఇతరులు ఏమనుకుంటారో అన్న భయంతో ఎలా వెనకాడుతూ ఉండేదో చెప్పుకొచ్చారు. తన బలవంతంపైనే ఏదోలా జిమ్‌కి వచ్చిందని నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. 

అలా ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసిన తర్వాత ఆమె తల్లిలో వచ్చిన మార్పుని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఆమె కూడా తనంతాటే ఇష్టంగా వ్యాయామాలు చేయడం ప్రారంభించిందని అన్నారు. ఫలితంగా రక్తపోటు, థైరాయిడ్‌ ఆరోగ్యం మెరుగపడిందని అన్నారు. ఈ మేరకు హరీష్‌ తల్లి సైతం జిమ్‌కి వెళ్లాక ఆరోగ్యం బాగుందని, ఏకంగా 18 కిలోలు తగ్గానని అంటోంది. అంతేగాదు షుగర్‌, రక్తపోటు, థైరాయిడ్‌ సమస్యలన్నీ తగ్గిపోయాయని ఆనందంగా చెబుతోంది. 

అలాగే కంటెంట్‌ క్రియేటర్‌ హరీష్‌ కూడా అందరు తమ తల్లిదండ్రుల ఆరోగ్యానికే ప్రాదాన్యత ఇవ్వాలని కోరాడు. అంతేగాదు తల్లి వ్యాయమాలు చేస్తున్న వీడియోలను కూడా షేర్‌ చేశారు. ఆమె ఫిట్‌నెస్‌ చర్యలో భాగంగా డెడ్‌లిఫ్ట్‌లను కూడా ఎత్తుతారామె. ఆమె కూడా తనలా ఇతరులు ఏమనుకుంటారో అని భయపడే వాళ్లు తమ పిల్లలు మాట విని ఆరోగ్యంగా ఉండాలని అన్నారామె.

పెద్దలకు మంచిదేనా..?
60 ఏళ్ల అనంతరం సరైన మార్గదర్శకత్వంలో వ్యాయామం చేయడం వల్ల బలం, సమతుల్యత, చలనశీలత తదితరాలన్ని మెరుగుపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. క్రమం తప్పని వ్యాయామాలు కండరాల క్షీణతను తగ్గించి, ఎముకలను బలోపేతం చేసి పడిపోయే ప్రమాదాన్ని నివారిస్తుందన్నారు.

 

(చదవండి: 30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్‌ మస్ట్‌)

 

Advertisement
 
Advertisement
Advertisement