కొందరు సుమోలు మాదిరిగా భారీ శరీరంతో ఉంటారు. వాళ్లు వెయిట్‌లాస్ అవ్వడం చాలాకష్టం. బరువు తగ్గే సర్జరీలు, ఫిట్‌నెస్ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే కాస్త బరువు తగ్గగలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఊబకాయులు బరువు తగ్గడం అంత సులభం కాదు. పైగా ఆ క్రమంలో చాలా నరకం చవి చూడాల్సి ఉంటుంది. కానీ ఈ మహిళ బరువు తగ్గాలనే కోరిక బలంగా ఉంటే..పట్టుదలతో ఇట్టే ఆ సమస్యను జయించొచ్చు అని నిరూపించిందామె.
ఆ మహిళ అమెరికాలోని కొలరాడోకు చెందిన కంటెంట్ క్రియేటర్ అనా అలోన్సో. తన శరీర బరువులో సగానికి పైగా బరువు తగ్గిన జర్నీని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నిజానికి ఆమె బరువు 204 కిలోలు. పట్టుదల, మానసిక స్థైర్యంతో బరువు తగ్గడానికి స్థిరంగా కట్టుబడి మరి స్మార్ట్‌గా మారింది ఆ పిల్లల తల్లి. ఒకప్పుడు అధిక బరువుతో..చిన్నపాటి కదలికలకే అల్లడిపోయే సవాళ్లను ఎదుర్కొంది.
నిరంతర ఆయాసంతో బయటకు అడుగుపెట్టాలంటేనే ఇబ్బంది పడేది. ముఖ్యంగా తన రూపం కారణంగా నలుగురిలోకి రావడానికి చాలా ఇబ్బందిపడేది. తాను ఎలాగైన చురుకైన తల్లిగా ఆత్మవిశ్వాసంతో ఉండాలన్న ఆరాటం ఆమెను బరువు తగ్గేందుకు పురికొల్పొంది. ముఖ్యంగా బరువు తగ్గి మంచి శరీరాకృతితో ఆత్మగౌరవంతో ఉండాలనే ఆకాంక్షతో చాలా పట్టుదలతో నిలకడగా బరువు తగ్గేందుకు ఉపక్రమించానని చెప్పుకొచ్చింది అనా.
శారీరక పరివర్తన ఎలా సాధించిందంటే..
మొదట్లో చిన్న పాటి కదలికలు కూడా కష్టమైందామెకు. సాధార వ్యాయామాలకే అలిసిపోయేది. అయితే అసౌకర్యాన్ని భరిస్తూ ముందుకు సాగింది.
అయితే నిలకడగా చేయడం ప్రతీది మార్చేసింది. కాలక్రమేణ బరువులు ఎత్తడం, స్క్వాట్స్ చేయడం, బహిరంగ పోటీల్లో పాల్గొనేంత వరకు పురోగతి సాధించింది. ఆమె పరివర్తన మొత్తం రాత్రికి రాత్రే జరగలేదు. మంచి జీవనశైలిని అవలంభిస్తూ..క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ..తగ్గడం సాధ్యమే అని నిరూపించింది.
ఎలా విజయవంతమైందంటే..
ఆరోగ్యకరమైన బరువు తగ్గడం కోసం అనా అనుసరించిన ముఖ్యమైన సూత్రాలేంటంటే..
క్రమం తప్పని వ్యాయామాలు కాలక్రమేణ బలాన్ని పెంచుకోవడానికి, కొవ్వును కరిగించుకోవడానికి, ఓర్పును మెరుగుపరుచుకోవడానికి సహయాపడ్డాయి. మొదట్లో ఎక్కువ దూరం వాకింగ్ చేసేది. ఆ తర్వాత రోజుకు రెండుసార్లు వ్యాయామాలు చేసేలా జిమ్‌లో చేరింది. అక్కడ బరువైన బార్‌బెల్స్, స్క్వాట్స్ వంటివి చేసింది.
జీవనశైలిలో మార్పులు
తీవ్రమైన డైటింగ్‌కు బదులుగాచ నిలకడైన అలవాట్లపై దృష్టి పెట్టింది.
మానసిక స్థైర్యం
ఒక్కోసారి వద్దు అనుకునే టైంలో భావోద్వేగంగా బలంగా ఉండటం ఎలాగో తెలుసుకుంది. ఎందుకు ఈ లక్ష్యం అనేది మననం చేసుకుంటూ..నిలకడగా చేస్తుండేది.
ఆ తర్వాత సమర్థవంతంగా బరువు తగ్గినా.. ఎక్సెస్ స్కిన్‌తో కొంచెం ఇబ్బంది పడింది. కానీ ప్రతిపని సునాయాసంగా చేసుకునే సామర్థ్యం పెంపొందించుకోగలిగానని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. ఇక్కడ అనా కథ ఎందరికో స్ఫూర్తి. ఆమె వెయిట్‌లాస్ స్టోరీ ఆరోగ్యం అనేది మనస్తత్వంతో గాఢంగా ముడిపడి ఉంటుందనే విషయాన్ని నొక్కి చెబుతోంది. నిరంతర కృషి, మానసిక బలం స్థిరమైన అలవాట్లతో, అత్యంత సవాలుతో కూడిన వెయిట్‌లాస్ జర్నీ అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుంది అనేందుకు అనానే ఉదాహరణ.
గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: సూపర్ స్టార్ రజనీకాంత్ పేరెంటింగ్ టిప్స్..! తండ్రిగా, హీరోగా ఎలా బ్యాలెన్స్ చేశారంటే..)


