మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ | - | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ

ఏలూరు టౌన్‌: టీడీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ–25 పేరుతో అంతులేని అక్రమాలకు పాల్పడిందనీ.. ని రుద్యోగులను మోసం చేసిందనీ.. డీఎస్సీలో ఉద్యో గ నియామకాల్లో పారదర్శకత ఎక్కడ ఉందంటూ.. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం పోరుబాట పట్టింది. ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ నాయకత్వంలో పార్టీ విద్యార్థి వి భాగం జిల్లా అధ్యక్షుడు పాతినవలస రాజేష్‌ ఆధ్వర్యంలో ఏలూరు పాతబస్టాండ్‌ అంబేడ్కర్‌ సెంటర్‌లో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌ మాట్లాడుతూ దగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలనీ, వి ద్యాశాఖ మంత్రి లోకేష్‌ను తక్షణమే బర్తరఫ్‌ చే యాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబూ మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీ నా అంటూ మండిపడ్డారు. పరీక్ష పేపర్లు లీక్‌ చేయటమే కాదు.. డేటాను డిలీట్‌ చేయటం అవినీతి, అక్రమాలకు భయపడి కాదా? అంటూ ప్రశ్నించా రు. చివరకు డీఎస్సీ ఫలితాల అనంతరం మెరిట్‌ లిస్ట్‌ను సైతం మాయం చేయటం అవినీతిలో భాగమేనా అంటూ నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే... ప్రత్యర్థులపై విరుచుకుపడే కూట మి నాయకులు డీఎస్సీ–25 కుంభకోణంపై నోటికి తాళం వేసుకోవటం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలన్నారు. కూటమి అవినీతితో సుమారు 4 వే ల మంది అభ్యర్థులు ఉద్యోగావకాశాలు కోల్పోవటం నిజం కాదా అని ప్రశ్నించారు. అన్యాయం జరిగిందంటూ 200 మంది అభ్యర్థులు కోర్టులో కేసులు వేస్తే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారనీ, అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం లెక్కచేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి చందు, నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు మునిశెట్టి సాయి, జిల్లా ప్ర దాన కార్యదర్శి షేక్‌ గౌస్‌, పార్టీ నగర అధ్యక్షుడు గు డిదేశి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కార్యదర్శి యుగంధర్‌ప్రసాద్‌, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, నగర యువజన అధ్యక్షులు సాయి తదితరులు పాల్గొన్నారు.

ఏలూరులో వైఎస్సార్‌సీపీ విద్యార్థి పోరు

Advertisement
 
Advertisement
Advertisement