భీమవరం: ఇంటర్నేషనల్ పురుషుల బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే భారత్ జట్టు జిల్లాకు చెందిన బీచ్ వాలీబాల్ క్రీడాకారులు ముదునూరి రామకృష్ణంరాజు, పెన్మత్స కృష్ణ చైతన్య ఎంపికయ్యారని జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యవామ మంగళవారం భీమవరంలో విలేకర్లకు తెలిపారు. జూన్ 4 నుంచి నాలుగు రోజులపాటు చైనీస్ తైపీలో జరగనున్న టూర్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు. పోటీలకు ఎంపికై న రామకృష్ణంరాజు, కృష్ణ చైతన్యలను సత్యవామ, కార్యదర్శి రాఘవేంద్రరావు, కోశాధికారి ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ కుమార్‌రాజు తదితరులు అభినందించారు.


