వీడిన ఆక్రమణల చెర
పాలకోడేరు మండలం శృంగవృక్షంలో గ్రామాభివృద్ధి కమిటీ చొరవతో ప్రభుత్వ భూమిని ఆక్రమణల చెర నుంచి విడిపించారు. 8లో u
కై కలూరు: అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆటపాక పక్షుల విహార కేంద్రంలో నీరు లేక పక్షులు పస్తులుంటున్నాయని పర్యావరణ ప్రేమికులు ప్రొఫెసర్ సుధాబత్తుల విజయకుమార్, సామాజిక కార్యకర్త ఎల్.ఎస్.భాస్కరరావులు ఆరోపించారు. నీరు లేక ఎడారిగా మారిన ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని మంగళవారం వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటపాకలో 286 ఎకరాల విస్తీర్ణంలో పక్షుల విహార చెరువును అటవీశాఖ ఏర్పాటు చేసిందన్నారు. ఏటా సైబిరియా, నైజిరియా, అస్ట్రేలియా వంటి దూర ప్రాంతాల నుంచి విదేశీ వలస పక్షులు విడిదికి వస్తాయన్నారు. వేసవిలో నీటి కొరత వేధిస్తున్నా అటవీ అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించడం లేదన్నారు. ఆటపాక పంట కాల్వ నుంచి నీటిని ఇక్కడకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. సమీప పోల్‌రాజ్ కాల్వలో నీరు ఉంటున్నా నీరు నింపడం లేదన్నారు. అటపాక పక్షుల కేంద్రం చుట్టూ చేపల చెరువుల్లో నీరు పుష్పలంగా ఉన్నాయన్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే పక్షుల కేంద్రం చెరువు బీటలు వారిందన్నారు. ఇప్పటికై న అధికారులు పక్షుల కేంద్రం చెరువులో ఎల్లప్పుడు నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.


