ఆరోగ్యశ్రీలో రూ. 6,740 గుంజేశారు | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీలో రూ. 6,740 గుంజేశారు

May 27 2026 5:56 AM | Updated on May 27 2026 5:56 AM

ఆరోగ్యశ్రీలో రూ. 6,740 గుంజేశారు

ఈ ఏడాది ఫిబ్రవరి 14న అత్తిలికి చెందిన నా సోదరి బొప్పే విజయలక్ష్మి ఇంట్లో కాలుజారి పడి కాలు విరిగిన సందర్భంలో తణుకు ఆపిల్‌ ఆస్పత్రిలో చేర్చాను. శస్త్రచికిత్స చేయాల్సిన క్రమంలో ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నప్పటికీ బెడ్‌ ఇవ్వకుండానే స్ట్రెచర్‌పైనే ఉంచి రక్తపరీక్షలు, ఎక్స్‌రే ఇతర ఖర్చులంటూ రూ.6,740 వసూలు చేశారు. మరో రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో డిశ్చార్జ్‌ అయి తణుకులోని మరో ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో చేర్చి ఉచిత వైద్యసేవలు పొందాము. దీనిపై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం జరగలేదు. – దొడ్డిపట్ల మల్లిఖార్జున గంగాప్రసాద్‌, అత్తిలి

Advertisement
 
Advertisement
Advertisement