మళ్లీ పెట్రో పిడుగు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ పెట్రో పిడుగు

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

కూల్‌.. కూల్‌గా.. ఆగని మట్టి తవ్వకాలు 8లో u

న్యూస్‌రీల్‌

సామాన్యుడి జీవితం దుర్భరం

ఇంకెన్నిసార్లు పెంచుతారో ?

అన్నింటి ధరలూ పెరిగాయి

పేదింట.. ధరల మంట

కూల్‌.. కూల్‌గా..
ద్వారకాతిరుమలలోని శ్రీవారి కొండపై గో సంరక్షణ శాలలో మూగజీవాలు షవర్‌ బాత్‌తో ఉపశమనం పొందుతున్నాయి. 8లో u

పోలవరం మండలంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎల్‌ఎన్‌డీపేట రిజర్వాయర్‌ నుంచి మట్టిని తవ్వేస్తున్నారు.

మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఒక పక్క వేసవి.. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజల నడ్డివిరిగేలా ప్రభుత్వాలు ధరల కొరడా ఝుళిపిస్తున్నా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉష్ణోగ్రతల వేడి తెలియనివ్వకుండా ఉండేందుకు పెట్రో ధరలను మళ్లీ మళ్లీ పెంచుతున్నాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ పెట్రో ధర లు తమ పదవీ కాలంలో ఒకసారో, రెండుసార్లో పెంచడానికి కూడా ఆలోచిస్తాయి. ఎందుకంటే సామాన్యులపై నేరుగా భారం పడే ఈ ధరల పెరుగుదల భవిష్యత్‌లో తమ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుందనే భయం ఉండేది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ధరలు పెంచడానికి కించిత్తు కూడా ఆలోచించడం లేదు. తమ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే అధికార దర్పం ప్రభుత్వాధినేతల్లో కనిపిస్తోంది..

పది రోజుల వ్యవధిలో..

పెట్రోల్‌, డీజిల్‌ రెండింటిపైనా సోమవారం ఉదయం నుంచి లీటరుకు రూ.3 చొప్పున ధరలు పెరిగాయి. పది రోజుల వ్యవధిలో ఇప్పటికే మూడుసార్లు ధర లు పెంచగా తాజా వడ్డనతో లీటరు పెట్రోల్‌ రూ.118, డీజిల్‌ రూ.105కు చేరుకున్నాయి. చము రు సెగతో నిత్యావసర ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల జీవనం దుర్భరంగా మారుతోంది. ఈనెల 15న ఉదయం నుంచి పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 చొప్పున ఆయిల్‌ కంపెనీలు ధరలను పెంచేశాయి. తర్వాత రెండుసార్లు రెండింటిపైనా రూ.0.90 పైసలు చొప్పున పెంచేశాయి. తా జాగా నాల్గోసారి ధరలను పెంచాయి. పది రోజుల క్రితం జిల్లాలో లీటరు రూ.109.90 ఉన్న పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.118కి చేరింది. అదేమాదిరి లీటరు రూ.97 వరకు ఉన్న డీజిల్‌ రూ.105కు పెరిగింది.

జిల్లాలో 260 బంకులు

ఏలూరు జిల్లాలో వివిధ ఆయిల్‌ సంస్థలకు చెందిన 260 పెట్రోల్‌ బంకులున్నాయి. వీటి ద్వారా రోజూ జిల్లా ప్రజలు మొత్తం 6.25 లక్షల లీటర్లను వినియోగిస్తున్నారు. దీనిలో 3.65 లక్షల లీటర్ల డీజిల్‌, 2.60 లక్షల లీటర్ల పెట్రోల్‌ను వినియోగిస్తున్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు పెరిగిన ధరలతో జిల్లా ప్రజలపై రోజుకు రూ.50 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. అంటే సుమారు రెండు రోజులకు ఒక లీటర్‌ పెట్రోల్‌ వినియోగించే వినియోగదారునిపై ఏడాదికి సు మారు రూ.1,800 అదనపు భారం పడుతోంది.

జిల్లాలో ఆయిల్‌ వినియోగం (ఒకరోజుకు)

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు సామాన్యుడి జీవితాన్ని దుర్భరంగా మార్చింది. ఎన్నికల ముందు ధరలు పెంచమని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఆ మాట మరిచారు. ప్రధానంగా డీజిల్‌ ధరల పెంపు ఆక్వా రంగంపై ప్రభావం చూపుతుంది. నిత్యావసర వస్తువులైన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ప్రజల జీవితాలపై పెనుప్రభావం చూపుతుంది.

–దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌), వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, కై కలూరు

వినియోగదారులపై భారం

రూ.50లక్షలు

పెట్రోల్‌

2.60లక్షల లీటర్లు

డీజిల్‌

3.65లక్షల లీటర్లు

పెట్రోల్‌ రూ.118.. డీజిల్‌ రూ.105

లీటరుకు రూ.3 చొప్పున వడ్డన

10 రోజుల్లో రూ.8 వరకు పెరిగిన ధరలు

జిల్లాలో వినియోగదారులపై రోజుకు రూ.50 లక్షల భారం

దేశంలోనే అత్యధికంగాఏపీలోనే పెరుగుదల

మేం పెరుగుతాం..

మీ కష్టం కూడా పెరుగుతుంది !

బియ్యం

పప్పులు

వంట నూనె

పాలు

కూరగాయలు

గ్యాస్‌

పది రోజుల్లో రూ.8కు పైగా పెట్రోల్‌ ధరలు పెంచడం దారుణం. సామన్యులు, చిరుద్యోగులకు పెంచిన ధరలు భారంగా మా రుతున్నాయి. ఇప్పటికే గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. దీనికి కొంత అదనపు భారం పడుతుండగా తాజాగా పెట్రోలు ధరలు కూడా పెంచితే సామాన్యులు ఎలా భరించగలరు. నిత్యా వసర సరుకుల ధరలూ పెరుగుతున్నాయి.

– కె.రమేష్‌బాబు, ఏలూరు

పెట్రోల్‌ ధరలు పెంచడంతో ఆ భారం ఒక్క పెట్రోల్‌ రూపంలోనే కాక ఇతర నిత్యావసరాల రూపంలో కూడా మాపై పడు తోంది. కూరగాయల ధరలు పెరిగాయి. హోటళ్లలో టీ ధరలు కూడా పెట్రో ధరల పెంపును కారణంగా చూపి పెంచేశారు. ఆటోలు కూడా చార్జీలు పెంచేశారు. రానున్న రోజుల్లో ఇంకా వేటి ధరలు పెరుగుతాయో అంచనా వేయలేకపోతున్నాం.

– ఎస్‌.అప్పారావు, ఏలూరు

ఇంత ఖర్చులు ఎలా భరించాలి

ఖర్చుల బిల్లు

డీజిల్‌ ధర పెరిగింది

సరుకుల రవాణా ఖర్చు పెరిగింది

గ్యాస్‌ ధర పెంపుతో ఇప్పటికే హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బజ్జీల బళ్లు, స్వీట్స్‌ షాపులు, కర్రీ పాయింట్లలో టిఫిన్‌, మీల్స్‌పై ప్లేటుకు రూ.5 నుంచి రూ.20 వరకు ధరలు పెంచేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు ప్రభావం సరుకుల రవాణాపై పడి వాటి ధరలకూ రెక్కలొచ్చాయి. మార్కెట్‌లో బియ్యం, పప్పులు, నూనెలు ధరలు పెరిగిపోయాయి. గతంలో సూపర్‌ఫైన్‌ కిలో బియ్యం రూ.62 ఉండగా ప్రస్తుతం రూ.69కు, గ్రేడ్‌–2 బియ్యం కిలో రూ.39 నుంచి రూ.46కు పెరిగాయి. పామాయిల్‌ లీటరు ప్యాకెట్‌ రూ.126 నుంచి రూ.140కు, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.140 నుంచి రూ.186కు చేరుకున్నాయి. కూరగాయాల ధరలు 30 శాతం నుంచి 40 శాతానికి పెరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement