ఏలూరు (టూటౌన్): ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్‌లలో మొత్తం 274 అర్జీలు అందాయని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్‌చార్జి డీఆర్వో దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తెలుగు పరీక్షకు 2,253 మంది విద్యార్థులకు 1,562 మంది హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సైతం ప్రారంభమయ్యాయి. ఎస్‌ఎస్‌సీ తెలుగు పరీక్షకు 173 మందికి 144 మంది, ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షకు 43 మందికి 32 మంది హాజరయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 19 కేంద్రాలను, జిల్లా విద్యాశాఖాధికారి 7 కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల సమాయ కమిషనర్ 5 కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 4,964 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 31 కేంద్రాల్లో ఫస్టియర్ పరీక్షలకు 3,480 మంది హాజరయ్యారు. వీరిలో 3,160 మంది జనరల్ విద్యార్థులకు 3,003 మంది, 518 మంది ఒకేషనల్ విద్యార్థులకు 477 మందికి 436 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 30 కేంద్రాల్లో సెకండియర్ పరీక్షలకు 1,484 మంది హాజరయ్యారు. వీరిలో 1,365 మంది జనరల్ విద్యార్థులకు 1,243 మంది, 271 మంది ఒకేషనల్ విద్యార్థులకు 241 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు.
ఏలూరు (టూటౌన్: జిల్లాలో జలధార–జలహారతి కార్యక్రమంలో ఇరిగేషన్, డ్వామా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలో జలధార కార్యక్రమంలో చేపట్టిన పనుల ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. రూ.82.22 కోట్లతో 1,929 పనులు మంజూరు కాగా, 380 పనులు పూర్తి అయ్యాయన్నారు. కాలువల్లో డీసిల్టింగ్ పనులను ఇరిగేషన్ శాఖ నిర్దేశించిన ప్రమాణాల మేరకు చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా లోపం గుర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్వామా పీడీ సుబ్బారావు, అదనపు పీడీ రాజశేఖర్, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎంపీడీఓలు, డ్వామా ఏపీడీ పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రస్తుత వేసవిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ సూ పరింటెండింగ్ ఇంజనీర్ పి.సాల్మన్‌రాజు ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రానున్న ఐదు రో జులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఈ మేరకు పూర్తి అప్రమత్తతతో ఉన్నామన్నారు. జిల్లావ్యాప్తంగా సు మా రు 400 ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉంచా మన్నారు. అలాగే ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. పర్యవేక్షక ఇంజనీర్, ఏలూరు: 9440812702, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జంగారెడ్డిగూడెం 9491049797, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏలూరు 9440812704, వి ద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912, లోడ్ మోనిటరింగ్ సెల్స్ జంగారెడ్డిగూడెం డివిజన్ 9491030712, ఏలూరు డివిజన్ 94409 04037, ఏలూరు సర్కిల్ 9440902926 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


