నారికేళం.. ధర పతనం | - | Sakshi
Sakshi News home page

నారికేళం.. ధర పతనం

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెట్టాలి

వెయ్యి కాయలు రూ.12 వేలు

రూ.8 వేల వరకూ తగ్గిన ధర

జిల్లాలో 25 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు

భీమవరం: జిల్లాలో వరితో పాటు ఆక్వా, కొబ్బరి సాగుకు రైతులు ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలో కొబ్బరితోటల సాగుతోపాటు పెరటిదొడ్లు, పుంత గట్లు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీయ రాజ్‌ రోడ్లు వెంబడి ఎక్కువగా కొబ్బరిని పెంచుతున్నారు. రెండు నెలలుగా దిగుబడి, ధర తగ్గడంతో కొబ్బరి రైతులు ఆందోళన చెందుతున్నారు.

20 మండలాలు.. 25 వేల ఎకరాలు

జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. యలమంచిలి, పెనుగొండ, పోడూరు, వీరవాసరం, పాలకొల్లు, పాలకోడేరు తదితర మండలాల్లో కొబ్బరి తోటలు ఎక్కువగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ఆక్వా సాగు పెరుగుతుండటంతో చెరువు గట్లపై కొబ్బరి పెంపకం కూడా పెరుగుతోంది. కొబ్బరి తోటల్లో ఎకరా విస్తీర్ణంలో 60 చెట్లకు గాను కొందరు 90 వరకు చెట్లు పెంచుతున్నారు. కొబ్బరి సాగుకు ఖర్చు తక్కువగా ఉండటంతో రైతులు ఎక్కువ ఆసక్తి చూపేవారు. అయితే కొన్నేళ్లుగా కొబ్బరికి నల్లమట్టి పురుగు, తెల్లదోమ వంటి తెగుళ్లు ఆశించడంతో పాటు చెట్టకు ఎరువులు వేయాల్సి రావడంతో పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది. దీనికితోడు కొబ్బరి దింపు, వ లుపు ఖర్చులు కూడా గణనీయంగా పెరగడంతో కొబ్బరి ద్వారా ఆశించిన ఆదాయం రావడం లేదు.

దిగుబడి.. ధరలు తగ్గుదలు

ఐదారు నెలలుగా కొబ్బరి దిగుబడులు బాగుండటంతో పాటు ధరలు కూడా పెరిగాయి. జిల్లాలో కొ బ్బరి ప్రధాన వ్యాపార కేంద్రమైన పాలకొల్లు నుంచి దాదాపు 100 లారీల కొబ్బరి కాయలు ఎగుమతులు కావడంతో వేలాది మందికి జీవనోపాధి దొరికేది. ఈ ఏడాది మార్చి వరకు రైతుల నుంచి వ్యాపారులు వెయ్యి కొబ్బరికాయలు రూ.20 వేల ధర వరకూ కొనుగోలు చేశారు. అలాగే ఒక్కో చెట్టుకు సుమారు ఏడాదికి 150 కాయల వరకు దిగుబడి వచ్చేది. అయితే ప్రస్తుతం దిగుబడితో పాటు ధరలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం వెయ్యి కాయలు రైతుల వద్ద రూ.12 వేలకు మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. తమను ప్రభుత్వం ఆదుకోకుంటే కొబ్బరి సాగు చేయలేమని రైతులు అంటున్నారు.

జిల్లాలో దాదాపు 13 వేల మంది రైతులు కొబ్బరి సాగు చేస్తున్నారు. అయితే రైతులంతా ఎగుమతులపై ఆధారపడటంతో కొబ్బరి ధర తగ్గినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కొబ్బరి సాగుతోపాటు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ధరలు హెచ్చుతగ్గులతో రైతు లకు ఇబ్బంది ఉండదు. కొబ్బరి పౌడర్‌ వంటి పరిశ్రమ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం 35 శాతం రాయితీతో రుణాలు మంజూరు చేస్తోంది. వా టిని వినియోగించుకుని ఆదాయం పొందవ చ్చు. అలాగే మరింత మందికి ఉపాధి కూడా క ల్పించవచ్చు. రైతులు కొబ్బరి అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెట్టాలి.

– ఎం.హరిప్రసాద్‌,

జిల్లా ఉద్యానశాఖ అధికారి, భీమవరం

Advertisement
 
Advertisement
Advertisement