ఓటర్‌ వెరిఫికేషన్‌ ప్రరకియ కీలకం | - | Sakshi
Sakshi News home page

ఓటర్‌ వెరిఫికేషన్‌ ప్రరకియ కీలకం

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

ఓటర్‌ వెరిఫికేషన్‌ ప్రరకియ కీలకం

దెందులూరు: ఓటర్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ అత్యంత కీలకమని, పార్టీలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయి లో అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండా లని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి పెదవేగి మండలం రాయన్నపాలెంలో దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బాయిచౌదరి క్యాంపు కార్యాలయంలో ‘సర్‌’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ ఓటర్‌ వెరిఫికేషన్‌పై పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తామని, పార్టీ శ్రేణులంతా అత్యంత శ్రద్ధతో సేవలందించాలన్నారు. పార్టీ జి ల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) మాట్లాడుతూ రానున్నది జగనన్న ప్రభుత్వమే అని, పార్టీ శ్రేణులంతా విజయానికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నారు. రెండేళ్లుగా పార్టీ శ్రేణు లు పడుతున్న ఇబ్బందులను పార్టీ అధ్యక్షుడు వై ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. పార్టీ నిర్దేశించిన అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే, నియోజవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బాయిచౌదరి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా లేకపోవడం వల్లే దేశంలో పలు రాష్ట్రాల్లో బలమైన నాయకులు ఓటమి చెందారని, పార్టీ శ్రేణులంతా ఓటర్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్తగా పెళ్లయిన వారు, మృతులు, వలసలు, దీర్ఘకాలిక వ్యా ధిగ్రస్తుల ఓట్ల విషయంలో మరింత శ్రద్ధ చూపాలన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు వి.వెంకటేశ్వర రావు, ఏపీ ఆయిల్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ కొఠారు రామచంద్రరావు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పెనుమాల విజయబాబు, జెడ్పీటీసీలు ఎన్‌.లీలానవకాంతం, మండల సరస్వతి, ఎంపీపీలు తాతా రమ్యశ్రీ, శ్రీనివాసరాజు, బత్తుల రత్నకుమారి, మండల పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి నాని, అప్పన ప్రసాద్‌, జానంపేట బాబు, దెందులూరు మండల వైస్‌ ఎంపీపీ వే మూరి జితేంద్ర, రాష్ట్ర కార్యదర్శులు కట్టా ఏసుబా బు, డీవీఆర్‌కే చౌదరి, గొల్ల కిరణ్‌, జిల్లా ఉపా ధ్యక్షుడు మేకా లక్ష్మణరావు, ఏలూరు రూరల్‌ మండ ల అధ్యక్షుడు తేరా ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement