ఏలూరు టౌన్: ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం సమీపంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయ భవనానికి విద్యుత్ సర్వీసును పునరుద్ధరించాలని, ఏపీ హైకోర్టు ఉత్తర్వులు తక్షణమే అమలు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్‌కు సోమవారం పార్టీ లీగల్‌సెల్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శులు వి.లక్ష్మీకుమార్, ఆల్తి శ్రీనివాస్, ఏలూరు లీగల్‌సెల్ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, నాయకులు జేసీకి సమస్య వివరించారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ మేరకు కంటెమ్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ మేరకు లీగల్ నోటీసులు జారీ చేశా మని స్పష్టం చేశారు. రిట్ పిటీషన్ తుది విచారణ పూర్తియ్యేవరకూ ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా విద్యుత్‌శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జేసీను కోరారు. నాయకులు డీవీ రామాంజనేయులు, బి.జగన్నాథరెడ్డి, వై.యశ్వంత్, పి.మధుకుమార్, ఫణికుమార్, రాజేష్, కె.తంబి తదితరులు ఉన్నారు. అలాగే ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వి గ్రహానికి పూర్తి రక్షణ కల్పించి, పరిరక్షణ, ని ర్వహణ, సుందరీకరణ పనులు చేపట్టాలని కో రుతూ పార్టీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో లీగల్ సెల్ నాయకులు జేసీకి వినతిపత్రం సమర్పించారు.


