30న ‘సర్‌’పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

30న ‘సర్‌’పై అవగాహన

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

30న ‘సర్‌’పై అవగాహన నిరుద్యోగులను వంచించిన కూటమి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

కై కలూరు: ఎన్నికల స్పెషల్‌ ఇన్‌సెంటివ్‌ రివిజన్‌ (సర్‌)పై ఈనెల 30న సాయంత్రం 4 గంటలకు కై కలూరు సీతారామ ఫంక్షన్‌ హాలులో పార్టీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) సోమవారం తెలిపారు. ఓటర్ల జాబితాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్పులు, చేర్పులు, ప్రధానంగా సర్‌ కార్యక్రమంపై అవగాహన కలిగిస్తామన్నారు. బూత్‌స్థాయి ఏజెంట్లు తప్పక హాజరుకావాలని పిలుపునిచ్చారు.

బుట్టాయగూడెం: ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ–2025లో కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాల రాజు అన్నారు. సోమవారం ఆయన దుద్దుకూరులో విలేకరులతో మాట్లాడుతూ విద్యాశాఖలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో 421 పోస్టులు అమ్ముకున్న వైనం ఇప్పటికే బట్టబయలైందన్నారు. ఇదేక్రమంలో జనరల్‌ డీఎస్సీలో కూడా భారీగా అ క్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. చంద్రబా బు నిరుద్యోగులను నిండా ముంచారని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ తక్షణమే మంత్రి పదవి నుంచి లోకేష్‌ను తప్పించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement