బాలలను నిరంతరం పర్యవేక్షించాలి | - | Sakshi
Sakshi News home page

బాలలను నిరంతరం పర్యవేక్షించాలి

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

బాలలను నిరంతరం పర్యవేక్షించాలి

దెందులూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యా య సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి సో మవారం ప్రపంచ తప్పిపోయిన పిల్లల దినోత్సవ సందర్భంగా ఏలూరు రూరల్‌ ఎంపీడీఓ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో ఇన్‌స్ట్రాగామ్‌, సోషల్‌ మీడియా ప్రభావం బాలలపై ఎక్కువగా ఉందని, తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే తప్ప సెల్‌ఫోన్‌లను ఇవ్వవద్దని అ న్నారు. బాలలు క్షణికావేశంలో ఇంటి నుంచి వెళ్లిపోవడం, సంఘ విద్రోహ శక్తులు మాయమాటలతో అక్రమ రవాణాకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయని అన్నారు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, పెద్దలు క్రమశిక్షణ నేర్పకపోవడంతో పిల్లలు ఇలా తయారవుతున్నారని, అందరూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రో త్సహించాలని సూచించారు. అపరిచితులు, అనుమానితుల గురించి బాలలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే 15100 ద్వారా న్యాయ సహాయం పొందాలని ఆమె సూచించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల బాలల సంరక్షణ అధికారులు సూర్యచక్రవేణి, ఆర్‌.రాజేష్‌కుమార్‌, మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ సుబ్బారావు, సీడబ్ల్యూసీ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌ పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి

Advertisement
 
Advertisement
Advertisement