అత్యవసర వైద్యం.. అందనంత దూరం | - | Sakshi
Sakshi News home page

అత్యవసర వైద్యం.. అందనంత దూరం

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

అత్యవసర వైద్యం.. అందనంత దూరం మెడికల్‌ కాలేజీ పూర్తి చేయాలి సమయం 3 గంటలు

మెడికల్‌ కాలేజీతో మెరుగైన వైద్యం

సుమారు రెండు నెలల క్రితం వీరవాసరం మండలానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యంతో భీమవరంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు మెరుగైన వైద్యం అవసరమైంది. అయితే స్థానికంగా స్పెషలిస్టులు లేకపోవడంతో వెంటనే గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

నరసాపురం మండలం ముత్యాలపల్లిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అంబులెన్స్‌లో భీమవరంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకురాగా అక్కడ వైద్యులు వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. భీమవరంలో ఎక్కడా అత్యవసర మెరుగైన వైద్యం అందించే న్యూరో స్పెషలిస్టులు లేకపోవడం, చినపిల్లల వైద్యానికి కూడా అత్యంత మెరుగైన వైద్య పరికరాలు, వైద్యులు లేకపోవడంతో వారిలో తండ్రిని కాకినాడకు, కుమారుడిని గుంటూరు మెడికల్‌ కళాశాలకు సిఫార్సు చేశారు. తండ్రిని కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. కుమారుడు ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు.

రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి అత్యంత మైరుగైన వైద్యం అందించి ప్రాణాలు నిలబడాలంటే పా లకొల్లు సమీపంలోని దగ్గులూరులోని మెడికల్‌ కాలేజీ అందుబాటులోకి రావాలి. క్షతగాత్రులను దూర ప్రాంతాలకు తీసుకువెళ్లేలోపు వారి పరిస్థితి విషమించి చనిపోతుండగా.. ఆయా కుటుంబాలు దిక్కులేనివి అవుతున్నాయి. మెరుగైన వైద్యం కోసం గుంటూరు, విజయవాడ, కాకినాడ తీసుకువెళ్లడం భారంగా ఉంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. మెడికల్‌ కాలేజీ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాలి.

– వి.శ్రీనివాస్‌, తోకలపూడి, వీరవాసరం మండలం

దూరం 130 కి.మీ.

భీమవరం(ప్రకాశం చౌక్‌) : జిల్లాలో ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి స్థానికంగా అత్యవసర వైద్యం అందించే పరిస్థితి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో లేదు. దీంతో ఎమర్జెన్సీ కేసులను గుంటూరు, విజయవాడ, కాకినాడ ప్రభుత్వాస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించిన క్షతగాత్రులు అంబులెన్సుల్లో తరలించేలోపు మృత్యువాత పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏదైనా రోడ్డు ప్రమాదం లేదా తీవ్ర అనారోగ్యం వస్తే జిల్లాలోని తణుకు, భీమవరంలోని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులకు తీసుకువస్తున్నారు. అయితే ఇక్కడ పూర్తిస్థాయిలో స్పెషలిస్టులు, మైరుగైన వైద్యం అందించడానికి పరికరాలు లేవు. దీంతో ఆయా ఆస్పత్రుల వైద్యులు వేరే ఆస్పత్రులకు సిఫార్సులు చేస్తున్నారు. క్షతగాత్రులను 125 కిలోమీటర్లకు పైగా దూరం తీసుకువెళ్లడం దాదాపు 2 గంటల నుంచి 3 గంటల వరకు సమయం ప ట్టడం కుటుంబసభ్యులకు ఇబ్బందిగా మారింది. అ లాగే ప్రమాద తీవ్రత కూడా పెరిగిపోతోంది.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండాలని సంకల్పించారు. దీనిలో భాగంగా పాలకొల్లు మండలం దగ్గులూరులో మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. అత్యంత మెరుగైన వైద్యం, అధునాతన పరికరాలు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ కాలేజీ నిర్మాణం పూర్తయితే పలురకాల స్పెషలిస్టులతో పాటు అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. అత్యవసర సేవలు కూడా వేగంగా అందుతాయి. అయితే కూట మి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ కాలేజీ నిర్మాణాన్ని అటకెక్కించింది. నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లా లో మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కూటమికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజలకు ఉత్తమ సేవలందించే వైద్య కళాశాల నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవ డం లేదు. స్థానికంగా మెడికల్‌ కాలేజీని అందుబాటులోకి తీసుకువచ్చి పేదల ప్రాణాల కాపాడవచ్చనే ఆలోచనల కూడా వీరు చే యడం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైద్యో నారాయణో ‘హరి’

స్థానికంగా అందని ఎమర్జెన్సీ సేవలు

తీవ్రంగా గాయపడిన వారికి వైద్యసేవలు కొరత

కాకినాడ, విజయవాడ, గుంటూరుకు సిఫార్సు

మార్గమధ్యలో మృత్యువాత

జిల్లాలో ముందుకు సాగని మెడికల్‌ కాలేజీ నిర్మాణం

Advertisement
 
Advertisement
Advertisement