చెక్‌పోస్ట్‌తో సమస్యలు | - | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్ట్‌తో సమస్యలు

May 25 2026 3:28 AM | Updated on May 25 2026 3:28 AM

చెక్‌పోస్ట్‌తో సమస్యలు తెలంగాణ అటవీ అధికారుల వసూళ్లు

బుట్టాయగూడెం: మండలంలోని కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు తెలంగాణ అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్‌తో ఇబ్బంది పడ్డారు. ఆలయానికి వచ్చే వాహనచోదకుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు తెలంగాణ అటవీ శాఖ అధికారులు చెక్‌పోస్ట్‌ను ఏర్పాటుచేయగా ఆలయ కమిటీ, గ్రామస్తులు ఇటీవల దానిని తీయించేశారు. అయితే మళ్లీ ఆ అధికారులు ఆదివారం టోల్‌గేట్‌ను ఏర్పాటుచేసి సొమ్ములు వసూలుచేశారు. అధిక సంఖ్యలో బస్సులు, మినీ వ్యాన్‌లు, ఆటోలు రావడంత ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. దీనిని పరిష్కరించేందుకు ఆలయ కమిటీ ఇబ్బందులు పడిఇంది. టోల్‌గేట్‌ పెట్టి సొమ్ములు వసూలు చేస్తున్న తెలంగాణ అటవీశాఖ అధికారులు కనీసం ట్రాఫిక్‌ క్లియరెన్స్‌కు కూడా చర్యలు తీసుకోలేదని వాహనచోదకులు అన్నారు. టోల్‌గేట్‌ ఏర్పాటు వివాదానికి చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement