మండపాక నుంచి గుమ్మంపాడు వెళ్లే (ఎడ్ల పందేల పుంత) రహదారిలోని రేలంగి కాలువపై వంతెన రెయిలింగ్ లేక ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా
రెయిలింగ్ కూలిపోయి దాదాపు పదేళ్లు కావస్తోంది. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల ప్రజలు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటారని, రాత్రిళ్లు ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బళ్ల చిన వీరభద్రరావు అన్నారు. వంతెన రెయిలింగ్ నిర్మించాలని కోరుతున్నారు. – ఇరగవరం


