కాళ్ల మండలం ఏలూరుపాడు గరువు ప్రాంతంలో లోఓల్టేజీ సమస్య పరిష్కారానికి స్థానికులు సొంత ఖర్చుతో ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె ఏర్పాటు చేసుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేస్తామని అధికారులు చెప్పడంతో దిమ్మె ఏర్పాటుచేశామని, ఏడాది గడిచినా ట్రాన్స్‌ఫార్మర్ మాత్రం బిగించడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. లోఓల్టేజీతో చాలా ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. దీనిపై విద్యుత్ ఏఈ రాంబాబును వివరణ కోరగా సమస్య పరిష్కారానికి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తామన్నారు. – కాళ్ల


