బుట్టాయగూడెం: మండలంలోని నూతిరామన్నపాలెం సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ కారు చెట్టును ఢీకొట్టింది. తాడేపల్లిగూడెంకు చెందిన కొందరు యువకులు గుబ్బల మంగమ్మగుడి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా నూతిరామన్నపాలెం సమీపంలో ఒక ఆటోను ఢీకొట్టి పక్కనే ఉన్న కొబ్బరిబొండాల కొట్టును ఢీకొట్టి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని ఆటో డ్రైవర్, కొబ్బరిబొండాల వ్యాపారులు సతీష్, భవానీ కోరుతున్నారు.
కాళ్ల: తల్లిదండ్రులు తమ పిల్లలను అనుమతి లేని పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కోల్పోవద్దని మండల విద్యాశాఖాధికారి–1 డీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాళ్ల మండలం సీసలి గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీ భారతి స్కూలు అడ్మిషన్లు నిర్వహిస్తూ, ఫీజులు వసూలు చేస్తున్నట్టు సమాచారం వచ్చిందని, ఈ నేపథ్యంలో యాజమాన్యానికి నోటీసు ఇచ్చామన్నారు. పిల్లలను గుర్తింపు లేని పాఠశాలలో చేర్పించడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే విద్యా పథకాలు, సంక్షేమ ప్రయోజనాలు, ఉపకార వేతనాలు, తల్లికి వందనం, యూనిఫాం, మధ్యాహ్న భోజన పథకం వంటివి వర్తించవని వెల్లడించారు.
రూ.2 లక్షల నగదు అపహరణ
ఏలూరు టౌన్: ఏలూరు ఆర్‌ఆర్‌పేట రైల్వే ట్రాక్‌రోడ్డులోని ఓ ఏసీల దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఏలూరు సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన గేదెల చంద్రశేఖర్ గత ఏడాది కాలంగా రైల్వేట్రాక్ రోడ్డులో డైకిన్ సాయిబాలాజీ కూలింగ్ సొల్యూషన్స్ పేరుతో ఏసీల విక్రయ దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి యథావిధిగా తన పనులు ముగించుకుని షాప్ షట్టర్లకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి షాపు వెనుకవైపు షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటంతో లోనికి వెళ్లి చూడగా కౌంటర్‌లోని రూ.2 లక్షల నగదు అపహకరణకు గురయ్యాయని గుర్తించాడు. సీసీ కెమెరాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి లోనికి ప్రవేశించి కౌంటర్‌లోని నగదు అపహరించినట్లు గుర్తించారు. షాప్ యజమాని చంద్రశేఖర్ ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
లింగపాలెం: మండలంలోని నరసన్నపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. కూరాకుల రత్తయ్యకు చెందిన కోళ్ల ఫారాలు కాలి బూడిదయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కై కలూరు: వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై రూరల్ పోలీసు స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ముదినేపల్లి మండలం బొమ్మినంపాడు గ్రామానికి చెందిన వివాహిత బోనాల దుర్గాతేజా(32) కొద్ది రోజులుగా రామవరంలో నానమ్మ ఇంటి వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వి.ప్రవీణ్ అనే వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె పెద్దలకు చెప్పింది. ప్రవీణ్‌లో మార్పు లేకపోవడంతో ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


