కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మ నీ చల్లని దీవెనలు మాకు అందించమ్మా అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం తరలివచ్చి అమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.80,870 ఆదాయం వచ్చిందని చెప్పారు.


