వీరవాసరం: దాళ్వా వరి కోతలు పూర్తయిన అనంతరం పొలాల్లో మిగిలిపోయిన వరిగడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చవద్దని వ్యవసాయ అధికారి కె.భరత్ సూచించారు. పొలాల్లో మిగిలిపోయిన వరిగడ్డిని పశుగ్రాసం కొరకు కొందరు రైతులు కట్టలు కడుతుంటే మరి కొందరు మిగిలిన వరిగడ్డిని కాల్చి వేస్తున్నారు. వరి గడ్డిని కాల్చడం వలన నేల సహజమైన సారవంతమైన స్వభావాన్ని కోల్పోతుందని, అంతేకాకుండా పంటలకు మేలు చేసే స్వప్న జీవులు నశిస్తాయని వ్యవసాయ అధికారి భరత్ వివరించారు. వరి చేలలో మిగిలిన అవశేషాలు కుళ్లిపోయేలా డి కంపోజర్లను వినియోగించడం వలన నేల సారవంతం పెరగడమే కాకుండా రసాయన రువులు వినియోగం కూడా తగ్గుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భూమి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా రైతులు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని ఆయన కోరారు.


