● ప్రభుత్వాసుపత్రిలో నరకమే | - | Sakshi
Sakshi News home page

● ప్రభుత్వాసుపత్రిలో నరకమే

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

● ప్రభుత్వాసుపత్రిలో నరకమే వైఎస్సార్‌ సీపీ నేతలకు పదవులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులను వివిధ పదవుల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏలూరు నియోజకవర్గానికి చెందిన మోటమర్రి సదానంద కుమార్‌ను రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా నియమించారు. అలాగే జిల్లా ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా రావి సునీల్‌ (నాని), ఎస్సీ సెల్‌ జిల్లా కార్యవర్గ సభ్యునిగా రాచేటి మట్టయ్య, జిల్లా వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శిగా కందా రాజు, యువజన విభాగం జిల్లా కార్యదర్శిగా పసుపులేటి దినేష్‌ నియమితులయ్యారు. వీరితో పాటు ఏలూరు నియోజకవర్గ ఐటీ విభాగ అధ్యక్షునిగా కొమ్మోజు ప్రేమ్‌కుమార్‌ను నియమించారు.

రోగుల బంధువులే స్కానింగ్‌, ఎక్స్‌రే వార్డులకు తీసుకెళ్తున్న దృశ్యం

పేద, మధ్యతరగతి వారికి ప్రభుత్వాసుపత్రే దేవాలయం. ఆసుపత్రికి వస్తే అన్ని రకాలుగా వైద్యం సకాలంలో అందుతుందనేది పాత మాట. ఇప్పుడు ఎందుకు వచ్చాం రా.. భగవంతుడా అన్నట్లు తయారైంది ఏలూరు సర్వజన ఆసుపత్రి. రోగులను ఎక్స్‌రేకు తీసుకెళ్లాలన్నా... రక్తనమూనాకు తీసుకెళ్లాలన్నా, స్కానింగ్‌ వార్డుకు తీసుకెళ్లాలన్నా రోగి బంధువులు నరకం చూడాల్సిందే. స్ట్రెచర్‌, వీల్‌చైర్‌పై తీసుకువెళ్లాలంటే నానా యాతన పడుతున్నారు. ఆసుపత్రి సహాయ ఉద్యోగులు స్పందించకపోవడంతో వారి బంధువులే అవస్థలు పడుతున్నారు. గురువారం ప్రభుత్వాసుపత్రిలో కనిపించిన దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్‌/ఏలూరు

వీల్‌చైర్‌ లేక మనవరాలి సాయంతో నడుస్తున్న వృద్ధురాలు

Advertisement
 
Advertisement
Advertisement