బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామంలో నివసిస్తున్న కొండరెడ్డి గిరిజనుల వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటు అందించేలా కృషి చేస్తున్నామని నాబార్డు డీడీఎం అనిల్‌కాంత్ అన్నారు. రామనర్సాపురంలో నాబార్డు యాక్షన్ సహకారంతో టీడీఎఫ్–మా తోట కార్యక్రమంలో భాగంగా హైబ్రీడ్ జీడిమామిడి, మామిడి మొక్కల పెంపకానికి అవసరమైన నీటి వసతులను కల్పిస్తున్నట్టు చెప్పారు. ఐదు గ్రామాల్లో 7 సోలార్ బోర్లు ఏర్పాటు చేశామన్నారు. సోలార్ ఫినిషింగ్‌ను 50 మంది రైతులకు అందించామని అన్నారు. గ్రామంలో సోలార్ బోరు, కరెంట్ మోటర్ పనితీరును పరిశీలించారు. యాక్షన్ స్వచ్ఛంద సంస్థ కో–ఆర్డినేటర్స్ సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.


