క్షేత్రంలో ఆటోవాలా బీభత్సం | - | Sakshi
Sakshi News home page

క్షేత్రంలో ఆటోవాలా బీభత్సం

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

క్షేత్రంలో ఆటోవాలా బీభత్సం జనగణన వేగిరపర్చాలి గంజాయి కేసులో పదేళ్ల జైలు బాల్య వివాహంపై కేసు 399 భూసమస్యల పరిష్కారం పీహెచ్‌సీల పనితీరు భేష్‌

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో మంగళవారం ఓ ఆటోవాలా బీభత్సాన్ని సృష్టించాడు. పూటుగా మద్యం సేవించి, పలు బైక్‌లను ఢీకొట్టాడు. దాంతో స్థానికులు అతడిని పోలీస్టేషన్‌లో అప్పగించారు. స్థానికుల కథనం ప్రకారం.. ఉప్పలపాడుకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ పూటుగా మద్యం సేవించి ఉదయం కొండపైకి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆటోను అతి వేగంగా నడుపుతూ, శివాలయం ఘాట్‌ రోడ్డు మీదుగా కొండ కిందకు వెళ్తున్నాడు. ఘటనా స్థలమైన ఆర్చిగేటు సమీపంలోకి వచ్చేసరికి ఆటో అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న పలు బైక్‌లను ఢీకొట్టింది. దానికి ముందు కొండపైన ఓ భక్తుడి బైక్‌ను ఢీకొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదాల్లో పలు బైక్‌లు ధ్వంసమయ్యాయి. బాధితులు ఆటో డ్రైవర్‌ను స్థానిక పోలీస్టేషన్‌లో అప్పగించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో జనగణన కార్యక్రమం బుధవారం నాటికి పూర్తిచేయాలని జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ ఆదేశించారు. మంగళవారం అ ధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఇళ్ల గణనలో ప్రగతి చూపని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. 70 శాతం కన్నా తక్కువగా గణన చేసిన అధికారులు కారణాలను తెలియజేసి, బుధవారంలోపు లక్ష్యాలను సాధించాల న్నారు. తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులను ఫోన్లలో సంప్రదించి వివరాలు నమోదు చే యాలన్నారు. ఇన్‌చార్జి డీఆర్వో ఎల్‌.దేవకీదేవి, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న, జెడ్పీ సీఈఓ జగదాంబ, డీపీఓ అనురాధ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

పాలకొల్లు సెంట్రల్‌: గంజాయి అక్రమంగా నిల్వ చేసి రవాణా చేసిన కేసులో ముగ్గురు ముద్దాలకు ఒ క్కొక్కరికీ 10 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించినట్టు మంగళవారం పట్టణ సీఐ కె.రజనీకుమార్‌ తెలిపారు. 2020లో పాలకొ ల్లు బైపాస్‌ రోడ్డు స్వప్న బా ర్‌ అండ్‌ రెస్టారెంట్‌ సమీపంలో కొందరు యువకు లు గంజా యి విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో తనిఖీ చేయగా గంజాయి విక్రయిస్తున్న వ్య క్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. అనంతరం విచారణ చేపట్టగా విశాఖకు చెందిన పోతురాజు సురేష్‌, సంకిన గణేష్‌, మూ రుగంటి ఈశ్వరరావుగా గుర్తించి అరెస్టు చేశామన్నారు. మంగళవారం కేసు విచారణలో జిల్లా అడిషనల్‌ జడ్జి యు.ఇందిర ప్రియదర్శిని ముద్దాయిలకు ఒక్కొక్కరికి 10 ఏళ్ల జైలుతో పాటు రూ.లక్ష జరిమానా విధించారన్నారు.

యలమంచిలి: మండలంలోని కాంభొట్లపాలేనికి చెందిన బాలికకు ఆచంట మండలం వల్లూరుకి చెందిన యువకుడితో వివాహం జరిగినట్టు వచ్చిన స మాచారంతో మంగళవారం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఎస్‌ఎన్‌ మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్టు హెడ్‌ కానిస్టేబుల్‌ కె.శ్యాంసన్‌రాజు తెలిపారు. గతంలో బాల్యవివాహం సమాచారం మేరకు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చామని మల్లీశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో పెళ్లి చేయమని చెప్పి రహస్యంగా ఈ ఏడాది ఏప్రిల్‌ 3న వివాహం చేశారన్నారు. ఈ విషయం తమకు ఆలస్యంగా తెలిసిందంటూ ఇరు కుటుంబాల తల్లిదండ్రులపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్‌ ద్వారా 18 విడతల్లో 399 భూసమస్యల దరఖాస్తులను పరిష్కరించినట్టు ఇన్‌చార్జి కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు అనుబంధంగా రెవెన్యూ క్లినిక్స్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తంగా 684 దరఖాస్తు లను తీసుకున్నామన్నారు. డివిజన్ల వారీగా భీమవరంలో 107 దరఖాస్తులు, నరసాపురంలో 104 దరఖాస్తులు, తాడేపల్లిగూడెంలో 50 దరఖాస్తులను పరిష్కరించామన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచి జిల్లా వైద్యారోగ్య వ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టాయని కలెక్టర్‌ సీహెచ్‌ నాగ రాణి తెలిపారు. హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తాజా పనితీరు అంచనాల్లో జిల్లాలోని 34 పీహెచ్‌సీల్లో 33 కేంద్రాలు ఏ గ్రేడ్‌ సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement