దేశరక్షణలో మేము సైతం అంటూ ఎన్‌సీసీ క్యాడెట్లు శిక్షణ పొందుతున్నారు. ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలో ఎన్‌సీసీ శిబిరంలో 574 మంది క్యాడెట్లకు డ్రిల్ విభాగంలో శిక్షణ ఇస్తున్నారు. యుద్ధ నైపుణ్యాలు, 22 రైఫిల్ ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, టెంట్ నిర్మాణ నిర్వహణ, విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్‌పై అవగాహనపై శిక్షణ ఇస్తున్నారు. 19 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ అమిత్ పాండే ఆధ్వర్యంలో శిబిరం నిర్వహిస్తుండగా.. బెటాలియన్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఎం. కొండయ్య, క్యాంపు కెప్టెన్ కె.శివశంకర్, సంజయ్ మౌర్య, సిద్ధప్ప పర్యవేక్షిస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు


