ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

ఐజీ అశోక్‌కుమార్‌

ఉంగుటూరు: జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణతో ముందకు వెళుతున్నామని ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీ య రహదారిపై గంజాయి రవాణాను అరికట్టడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నేరాల అదుపునకు చర్యలు చేపట్టామన్నారు. మహిళల రక్షణకు జిల్లాలో 25 వేల కెమెరాలు అమర్చామన్నారు. అనంతరం ఆయన మహి ళా పోలీసులతో సమావేశమయ్యారు. గ్రామా ల్లో ప్రజలతో మమేకం కావాలని, గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌పై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. సోషల్‌ మీడియా ప్రభావంతో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, సెల్‌ఫోన్లకు పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్నారు. పరీక్షల్లో అధిక మార్కులు వచ్చిన ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్ల పిల్లలను సత్కరించారు. మహిళా పోలీసులు, చేబ్రోలు పోలీసులకు హె ల్మెట్లు అందించారు. తిరుమల పాల పరిశ్రమ అందించిన అంబులెన్స్‌ను మరోమారు ఐజీతో డాక్టర్‌ శ్రావణరెడ్డి పీహెచ్‌సీకి అందజేశారు. తొలుత స్టేషన్‌లో రికార్డులను ఆయన పరిశీలించారు. ఎస్పీ కేపీ శివకిషోర్‌, డీఎస్పీ శ్యామ్‌కుమార్‌, సీఐ రజనీకుమార్‌, ఎస్సైలు సూర్యభగవాన్‌ (చేబ్రోలు), మణికుమార్‌ (గణపవరం ), ఏలూరు ఎస్‌బీ ఎస్సై ఐ.రమేష్‌ (నిడమర్రు) పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement